పెళ్లి పీటలెక్కనున్న నాగ చైతన్య శోభిత ధూళిపాళ.. సంతోషంలో నాగార్జున!!

అందరూ ఊహించిందే జరిగింది. టాలీవుడ్ హీరో నాగచైతన్య, శోభిత దూళిపాళ నిశ్చితార్ధం జరిగిపోయింది. నాగార్జున ఇంట పండుగ వాతావరణం ఈ వేడుకతో చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం నుండి వీరి నిశ్చితార్ధ వేడుక నిజమా కాదా అని అటు సినీ ఇండస్ట్రీలోనూ, ప్రజలలోనూ పెద్ద చర్చ జరగగా ఎట్టకేలకు సీక్రెట్ రివీల్ చేశారు అక్కినేని నాగార్జున.

నాగ చైతన్య శోభిత ధూళిపాళ పై చర్చ
సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య, శోభిత ధూళిపాళ లపై గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. వారిద్దరూ లవ్ లో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇక ఆ ప్రచారానికి ఊతమిస్తూ నాగ చైతన్య శోభిత ఇద్దరు లండన్ లోని హోటల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వారిద్దరి రిలేషన్ ను బయటపెట్టాయి.

Naga Chaitanya Sobhita Dhulipala Engaged finally nagarjuna announced officially

నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ పై నాగార్జున
ఇక ఫైనల్ గా వారిద్దరూ ఒక్కటి కాబోతున్నారని నాగార్జున కీలక విషయాన్ని వెల్లడించారు. వీరిద్దరూ హైదరాబాద్ లోని తమ నివాసంలో నేడు నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ రోజు ఉదయం 9.42నిముషాలకు వీరికి నిశ్చితార్ధం జరిగిందని, త్వరలో వీరిద్దరూ వివాహం చేసుకుని ఒక్కటి కాబోతున్నారని అక్కినేని నాగార్జున ప్రకటించారు.

శోభితను సంతోషంగా ఆహ్వానిస్తున్నాం అన్న నాగార్జున
తన కుమారుడు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్ధ వేడుక జరిగిందని పేర్కొన్న ఆయన శోభితను తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉందని వెల్లడించారు. వారిద్దరూ జీవితాంతం కలిసుండాలని కోరుకుంటున్నామని చెప్పారు. దేవుడి ఆశీర్వాదం ఈ జంటకు ఎల్లప్పుడూ ఉండాలని నాగార్జున ఆకాంక్షించారు. నాగార్జున ఫ్యామిలీ, శోభిత ఫ్యామిలీ సమక్షంలో వీరి నిశ్చితార్ధ వేడుక జరిగింది.

సమంత ఎలా స్పందిస్తుందో
ఇక వారిద్దరితో కలిసి ఉన్న ఫోటోను ట్వీట్ చేశారు. వారిద్దరి ఎంగేజ్మెంట్ ఫోటోలు ప్రస్తుతం బయటకు వచ్చాయి.మొత్తానికి జనం అనుకున్నదే నిజం చేసి ఈ జంట ఒక్కటి కాబోతున్నారు. ఒకవైపు నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ చేసుకోగా ఇప్పుడు అందరూ సమంత ఇప్పుడు వీరి విషయంలో ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది ఆసక్తిగా చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+