నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత..'హైడ్రా'కు మద్దతుగా నాగబాబు ట్వీట్
మెగా బ్రదర్ నాగబాబు మరో సంచలనానికి తెరలేపారు. ఆయన తాజాగా హైడ్రాకు మద్దతుగా చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది.గతంలో బల్డియా, హెచ్‌ఎండీఏ ఇతర మున్సిపాలిటీల పరిధిలో దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చెరువు సమీపంలో ఉన్న వాటిని తిరస్కరిస్తున్నారు. హైడ్రా ఎఫెక్ట్ సెలబ్రిటీలకు సైతం తప్పడం లేదు. నాగార్జునకు సైతం హైడ్రా భారీ షాక్ ఇచ్చింది. మాదాపూర్‌లోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్‌ను నిర్మించారనేఆరోపణలు వచ్చాయి.
ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణంపైనా ఫిర్యాదుల వచ్చాయి. ఎన్ కన్వెన్షన్‌ను తాకుతూనే చెరువు నీళ్లు ఉంటాయి. దీంతో, ఈ నిర్మాణంకు సంబంధించి హైడ్రా పూర్తి వివరాలు సేకరించింది. తుమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని హైడ్రా గుర్తించింది. దీంతో అక్రమ కట్టడం క్రింద ఆ భవనాన్ని కూల్చివేయడం జరిగింది. ఇదిలా ఉంటే హైడ్రా గురించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

భారీ వర్షాలు,వరదలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలకుతలం చేశాయి. ముఖ్యంగా ఏపీపై ఈ భారీ వర్షాల ఎఫెక్ట్ గట్టిగానే పడింది. ఈ సందర్భంగా హైడ్రాను ఉద్దేశించి నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. వర్షాలకు తూములు తెగిపోయి, చెరువులు, నాళాలు ఉప్పొంగిపోయి అపార్ట్మెంట్లలోకి కూడా నీళ్లు రావడం మనం చూస్తున్నాం. దీనికి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. వీటికి ముఖ్య కారణం చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడమే దీనికి కారణమని నాగబాబు ట్వీట్ చేశారు.
వర్షాలు పడి తూములు తెగిపోయి,చెరువులు నాళాలు ఉప్పొంగి పోయి అపార్ట్మెంట్ లకి కూడ నీళ్లు రావడం,కొన్ని సామన్య ప్రాణాలు కూడ బలికావడం చాల బాధకారం వీటికి ముఖ్య కారణం చెరువుల్ని నాళాలని అక్రమ కబ్జా చేసి నిర్మాణాలు చేయడమే ..
— Naga Babu Konidela (@NagaBabuOffl) September 1, 2024
ఇప్పటికైన అర్ధమైందా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
దీనికి నివారణగా సీఎం రేవంత్ ధైర్యంగా హైడ్రా కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దీనికి అందరూ సపోర్ట్ చేయాలని ట్వీట్ చేశారు. ఇప్పటికైనా అర్థ అయ్యిందా సీఎం రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన హైడ్రా చేస్తున్న పని మంచిదే అన్నారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్‌ను కూల్చిన సమయంలో నాగబాబు ఇలా ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీన్ని బట్టి నాగార్జున ఎన్ కన్వెన్షన్ అక్రమంగా కట్టారు కాబట్టే, దాన్ని కూల్చివేశారనే అభిప్రాయాన్ని నాగబాబు వ్యక్తం చేసినట్టు అయింది. దీనిపై అక్కినేని ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications