మల్టీప్లెక్స్ ల్లో బాలకృష్ణ సంచలన రికార్డ్
నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'భగవంత్ కేసరి' సినిమాకు సంబంధించి టికెట్ బుకింగ్స్ మొదలయ్యాయి. ప్రముఖ మల్టీప్లెక్స్ ల్లో ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ లో బుకింగ్స్ జరుగుతున్నాయి. సినిమా విడుదలకు మరో 24 గంటల సమయం మాత్రమే ఉండగా, మల్టీప్లెక్స్ ల్లో ఈ సినిమాకు మొదటిరోజు టికెట్లు దొరకడం కష్టమంటున్నారు.
కొత్త రికార్డుల నమోదు
బుకింగ్స్ విషయంలో ఈ సినిమా అదరగొడుతోంది. ఓవర్సీస్ లో బుకింగ్స్ కు సంబంధించి నూతన రికార్డులను ఈ చిత్రం నమోదు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తోంది. బాలకృష్ణ కెరీర్ లోనే 'భగవంత్ కేస'రి సినిమాకు బిగ్గెస్ట్ కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫస్ట్ వీకెండ్ వరకు బాక్సాఫీస్ వద్ద 'భగవంత్ కేసరి' జోరుకు బ్రేకులు వెయ్యలేమని, పాజిటివ్ టాక్ వస్తే దసరా పండుగ వరకు ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించే అవకాశం ఉందంటున్నారు.

పాజిటివ్ గా స్పందిస్తున్నారు
ఈ సినిమాపై తెలుగు సినీ పరిశ్రమలో కూడా అందరూ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. శ్రీలీల ఈ సినిమాతో మరోసారి మ్యాజిక్ చేస్తారంటున్నారు. కేసరికి లాంగ్ రన్ ఉంటుందంటున్నారు. వన్ లైనర్ డైలాగ్స్ ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఎంత పోటీ ఉన్నా తెలుగు రాష్ట్రాల వరకు 'భగవంత్ కేసరి' సినిమాకు భారీ టార్గెట్ ఉంది. ఈ సినిమా విడుదలతో బాలయ్య అభిమానులుకు ముందుగానే దసరా వచ్చేసిందని, భవిష్యత్తులో చేయబోయే ప్రాజెక్టులన్నీ భారీ రేంజ్ లో ఉండబోతున్నాయంటున్నారు. అంతేకాకుండా సినిమా సినిమాకు సంచలన రికార్డులు నమోదు చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications