మొన్న ఎవడో ఒక వెధవ కూశాడుగా: బాలకృష్ణ

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల సంగతేకాదు.. రాజకీయమైనా, నిజ జీవితమైనా.. ఏదైనా నిర్మొహమాటంగా మాట్లాడతారు. ఆ తీరు కొందరికి నచ్చుతుంది.. మరికొందరికి నచ్చదు. ఎవరైనా, ఏమైనా అనుకుంటారేమో అనే భయం మాత్రం కొంచెం కూడా కనిపించదు.

ట్రోలర్స్ కు చురకలు
మొన్న అసెంబ్లీలో బాలయ్య చేసిన రచ్చ తెలిసిందే. తొడకొట్టడం, విజిల్స్ వేయడంలాంటివి చూస్తుంటే అందరికీ విషయం అర్థమైపోయింది. ప్రస్తుతం ఆయన భగవంత్ కేసరి చిత్రం చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ హీరోయిన్ గా, శ్రీలీల ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో బాలకృష్ణ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ బాగా ఆకట్టుకుంది. అక్టోబరు 19వ తేదీన విడుదల కాబోతోంది. చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ సినిమా ప్రెస్ మీట్ లో బాలయ్య ట్రోలర్స్ కు చురకలు అంటించారు.

nandamuri balakrishna movie bhagavanth kesari latest update

మనమంతా ఓపెన్ బుక్
గతంలో తన విగ్ పై కామెంట్ చేసినవారిపై మండిపడ్డారు. తనకు భయం లేదన్నారు.. ఏదైనా నేరుగా అనేస్తానని వ్యాఖ్యానించారు. మొన్న ఎవడో ఒక వెధవ వీడు విగ్ పెట్టుకుంటాడా? అని అడిగాడు. నేను విగ్ పెట్టుకుంటే నీకేంటయ్యా.. నువ్వేం పీక్కొని గడ్డం పెట్టుకున్నావని అడిగినట్లు చెప్పారు. మనమంటే అంతా ఓపెన్ బుక్ అని, ఎవడికీ భయపడేదిలేదన్నారు. కెమెరామెన్ రాంప్రసాద్ కు తన ప్రతి కదలిక తెలుసని, వీఎస్ స్వామి దగ్గర అసిస్టెంట్ చేసిన సమయంలో కూడా అందరం కలిసి టిఫిన్ చేసేవారిమన్నారు. ఒక చెట్టుకింద హ్యాపీగా కూర్చొని చాప, దిండు వేసుకొని పడుకునేవారిమని, ఆరోజుల్లో క్యారవాన్లు లేవన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+