భారీగా నయనతార ఆస్తులు

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. . అతి తక్కువ సమయంలోనే సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. స్టార్ హీరోలు, అగ్ర కథానాయకులందరితో నటించింది. ప్రేక్షకుల మనసు దోచుకుంది. సినిమాలో నటించేందుకు నయన భారీ పారితోషికం తీసుకుంటుంది. హీరోలతో సమానంగా ఆమె రెమ్యునరేషన్ ఉంటుంది.

నటించడం వరకే: సినిమాలో నటించడంవరకే ఆమె పని. షూటింగ్ పూర్తయిన తర్వాత ఎటువంటి కార్యక్రమంలో పాల్గొనదు. అయినా ఈ అమ్మడు అంటే సినీ ప్రేక్షకులకే కాదు.. పరిశ్రమలోని అందరికీ క్రేజ్. అట్లీ దర్శకత్వంలో జవాన్ కథానాయికగా నటించింది. బాలీవుడ్ లో తొలి సినిమా సూపర్ హిట్ అవడంతో ఆఫర్లు వస్తున్నాయి.నయనతార ఒక్కో సినిమాకు 14 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

nayanthara property value

సినిమాకు రూ.14 కోట్లు: ఎన్నో సినిమాల్లో నటించిన నయనతార కొన్ని కోట్ల రూపాయలను సంపాదించి అంతేస్థాయిలో ఆస్తులు కూడబెట్టింది. ఇప్పటివరకు నయనతార ఆస్తి విలువ సుమారు 170 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ఇందుకు ఒక్కో సంస్థ నుంచి 5-6 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుంది.

జెట్ విమానం: నయనతారకు హైదరాబాద్ లో రెండు ఖరీదైన భవనాలు, ఒక స్టార్ హోటల్ ఉంది. హైదరాబాద్ లో ఉన్న ఈ ఒక్కో భవనం విలువ రూ.15 కోట్ల వరకు ఉంటుంది. చెన్నైలో అత్యాధునిక సౌకర్యాలతో ఒక ఇల్లు ఉంది. కేరళలో కూడా భారీగానే ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. నయనతారకు స్పెషల్ గా ఒక జెట్ విమానం ఉంది. ఈ మధ్యకాలంలో నయనతార సినిమాల కంటే వ్యాపారాలపై ఎక్కువ ఆసక్తిని చూపిస్తోంది. మున్ముందు ఇంకా ఎంత మొత్తంలో ఆస్తులు సంపాదిస్తుందో.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+