Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"హరిహర వీరమల్లు"పై క్రిటిక్ రివ్యూ.. నమ్మకం లేదు దోర అంటూ కామెంట్

రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' ఫీవర్‌తో ఊగిపోతుంది. అనేక వాయిదాల తర్వాత ఈ చారిత్రక యాక్షన్ డ్రామా జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏఎమ్ రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మించారు.ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను తారా స్థాయికి చేర్చింది. పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ చూడని లుక్‌లో, శక్తివంతమైన బందిపోటు వీరమల్లుగా కనిపించి అభిమానులను ఉర్రూతలూగించాడానికి సిద్ధమవుతున్నారు.

ఔరంగజేబు కాలంనాటి చారిత్రక నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రంలో, బందిపోటు వీరమల్లు కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారతదేశానికి తీసుకురావడమే తన లక్ష్యంగా పని చేయబోతున్నట్టు ట్రైలర్ చూస్తూనే అర్థం అవుతోంది. ఈ సినిమాతో పవన్ కల్యాణ్ రికార్డుల వేటను మొదలుపెడతాడని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పటికే థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం కనిపిస్తోంది. మరి కొద్ది గంటల్లో ప్రీమియర్స్ మొదలుకానున్నాయి.

Netizen counters critical review of Harihara Veeramallu

అయితే ఈ సందర్భంగా ప్రముఖ జేపీఆర్ ఫిల్మ్స్ తన అధికారిక ట్విట్టర్‌లో 'హరిహర వీరమల్లు' సినిమాపై రివ్యూ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు చూసిన పవన్ కల్యాణ్ ఒక ఎత్తు.. హరిహర వీరమల్లు సినిమాలో పవర్ స్టార్ మరో ఎత్తు," అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా సినిమాలో బాబీ డియోల్ (Bobby Deol) పాత్ర ఒక పెద్ద సర్ ప్రైజ్ అని, ఇంటర్వెల్‌కు ముందు వచ్చే 25 నిమిషాల నిడివి గల 3 ఎపిసోడ్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తాయని జేపీఆర్ ఫిల్మ్స్ పేర్కొన్నారు.

థియేటర్లు తగలబడకపోతే నన్ను అడుగు. రాసుకో సాంబా, అంటూ జేపీఆర్ ఫిల్మ్స్ చేసిన వ్యాఖ్యలు సినిమాపై భారీ అంచనాలకు తెర తీశాయి.అయితే దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ నమ్మకం లేదు దోర అంటూ కామెంట్ చేశాడు. దీనికి కౌంటర్‌గా పవన్ అభిమాని నమ్మాలి దోర అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్విట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+