ఆంటీలా ఉన్నావ్.. బిగ్‌బాస్ బ్యూటీకి షాకిచ్చిన నెటిజన్
సోషల్ మీడియా వచ్చిన తరువాత సెలెబ్రిటీలకు సైతం వేధింపులు తప్పడం లేదు. ఆంటీలా ఉన్నావ్ అంటూ బిగ్‌బాస్ బ్యూటీకి షాకిచ్చాడు ఓ నెటిజన్. తాను ఎలా ఉంటే నీకెందుకు అంటూ ఆ నెటిజన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చింది సదరు బిగ్‌బాస్ బ్యూటీ. ఆ వివరాల్లోకి వెళ్తే..దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్య్వూ చేసి ఒక్కసారిగా లైఫ్ లైన్‌లోకి వచ్చింది అరియనా గ్లోరీ.
ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూతో అరియనా గ్లోరీ కెరీర్ మారిపోయింది. సోషల్ మీడియాలో అరియనా క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఎతంలా అంటే .. బిగ్‌బాస్‌కు ఎంపిక చేసేంతలా అరియనా ఫాలోయింగ్ పెరిగిపోయింది. బిగ్‌బాస్‌కు సెలెక్ట్ అయినా అరియనా గ్లోరీ టాప్ 5లో నిలిచి సంచలనంగా సృష్టించింది. బిగ్‌బాస్ షోతో అరియనా మంచి పాపులారిటీ రాబట్టింది.

బిగ్‌బాస్ తరువాత అరియనాకు పలు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం టీవీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఆర్టిస్ట్‌గా మారిపోయింది. అయితే అరియనాకు ఓ నెటిజన్ షాకిచ్చాడు. అరియనాను ఉద్దేశించి బాగా లావు అయ్యావ్..ఆంటీలా ఉన్నావ్ అంటూ చాలా దారుణంగా ఆ నెటిజన్ సోషల్ మీడియాలో మేసేజ్ పెట్టాడు. దీనిపై రియాక్ట్ అయినా అరియనా ఆ నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చింది.

మీకు పని పాటా లేదా. నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. ఇలా నన్ను భాదపెడితే మీకు ఆనందం వేస్తుందా అంటూ నెటిజన్‌పై ఫైర్ అయింది.సన్నగా ఉంటే ఏంటి ఇంత సన్నగా ఉన్నావు అంటారు. లావు అయితే లావైపోయావు అంటారు. అయినా నేను ఎలా ఉంటే మీకెందుకు.నచ్చితే కామెంట్స్ చెయ్ పర్లేదు. నేను నచ్చకపోతే.. నన్ను బ్లాక్ చేయ్.నేను పట్టించుకోను. ఖాళీగా ఉంటూ ఇలాంటి కామెంట్స్ చేస్తుంటారని చెప్పి ఆ నెటిజన్‌కు అరియనా దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications