'సలార్' కు థియేటర్లను ఇవ్వలేదు?
పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రం రేపు విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మించింది. శ్రుతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు తదితరులు నటించారు. ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయంటే.. ఆకాశాన్ని తాకేటట్లుగా ఉన్నాయి. ప్రభాస్ కు కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు.
నార్త్ లో పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ సినిమాస్ సింగల్ స్క్రీన్ థియేటర్స్ ని సలార్ సినిమాకి కేటాయించలేదు. దీనికి ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ జరగలేదని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షారుక్ ఖాన్ తన మాఫియాని వాడి సలార్ కి థియేటర్స్ మిస్ అయ్యేలా చేసాడంటూ డార్లింగ్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ఆ కోపంతోనే డంకీ సినిమాపై నెగటివ్ ట్రెండ్ ప్రచారం చేస్తున్నారు. డార్లింగ్ ఫ్యాన్స్ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో డంకీ సినిమాని డాంకీ అనే పేరుతో ట్రెండ్ అయ్యేలా చేశారు. ఈ సినిమా షారుక్ కు హ్యాట్రిక్ ఇచ్చిందా? లేదంటే నిరాశ పరిచిందా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. మ్యాట్నీ పూర్తయితేకానీ ఒక క్లారిటీ రాదు.
సోషల్ మీడియాలో "SRKs DISASTER DONKEY" ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. టాక్ తో సంబంధం లేకుండా "SRKs DISASTER DONKEY" ట్యాగ్ చేస్తున్నారు. ఈరోజు అర్థరాత్రి షోలతో సలార్ ప్రభంజనం మొదలు కానుంది. రూ.800 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ సినిమా రంగంలోకి దిగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.250 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేయాల్సి ఉంది.












Click it and Unblock the Notifications