'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు ఆయన బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అటు బన్ని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక అల్లు అర్జున్ 2003 లో గంగోత్రి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు బన్నీ. నటన, డ్యాన్స్ తో అందరినీ అలరించారు. నేషనల్ అవార్డు కైవసం చేసుకుని పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటారు అల్లు అర్జున్. పుష్ప సినిమాతో భారత్ లోనే గర్వించదగ్గ నటుడిగా ఎదిగారు. ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు బన్ని.

అయితే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా బర్త్ డే విషెస్ చెప్పారు. "హ్యాపీ బర్త్ డే బావా.. హావ్ ఏ ఫంటాస్టిక్ డే టుడే.. ఈ సంవత్సరం నీకు పెద్ద పెద్ద విజయాలు తీసుకురావాలి. నీకు కొండంత ప్రేమను పంపిస్తున్నాను.." అని ఎమోషనల్ పోస్టు పెట్టారు. అయితే ఎన్టీఆర్ పోస్టుకు బన్ని వెంటనే రిప్లై ఇచ్చారు. "బావా.. థ్యాంక్యూ సో మచ్.. మీ విషెస్ కు నీకూ కొండంత ప్రేమ అందిస్తున్నా.." అని ఎమోషనల్ రిప్లై ఇచ్చారు. దాంతో అటు ఎన్టీఆర్, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆ బాండింగే వేరయ్యా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. బావా బామ్మర్ది అంటే ఇలాగే ఉండాలి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Wishing you a very Happy Birthday Bava @alluarjun. Have a fantastic day today and an even bigger year ahead. Sending you lots of love!
— Jr NTR (@tarak9999) April 8, 2026
ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో మూవీ చేస్తున్నారు. బన్ని బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీకి 'రాకా' అనే టైటిల్ పెట్టారు. ఇందులో మూడు విభిన్నమైన పాత్రల్లో బన్ని నటిస్తున్నారు. ఈ మూవీ రూ. 700 కోట్ల బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇదో సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ అని తెలుస్తోంది. అలాగే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలోనూ అల్లు అర్జున్ ఓ మూవీ చేస్తున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోనూ అల్లు అర్జున్ ఓ మూవీ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఎన్టీఆర్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications