ఇట్స్ అఫీషియల్.. పెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్ స్టార్లు!

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి పెద్ద కుమారుడు, ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు కాలభైరవ, నటి కావ్య కల్యాణ్ రామ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట.. సోషల్ మీడియా వేదికగా తమ బంధాన్ని అధికారికంగా ప్రకటిస్తూ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

'మీర్జాపూర్: ది మూవీ’కి బిగ్ షాక్.. ఆ సీన్లు కట్, రన్ టైమ్ ఎంతో తెలుసా?
'మీర్జాపూర్: ది మూవీ’కి బిగ్ షాక్.. ఆ సీన్లు కట్, రన్ టైమ్ ఎంతో తెలుసా?

ప్రకృతి అందాలతో ప్రేమను పోల్చిన కాలభైరవ
కావ్యతో తనకున్న అనుబంధాన్ని వ్యక్తపరుస్తూ కాలభైరవ ఎంతో కవితాత్మకంగా భావాలను పంచుకున్నారు. "నీతో గడిపే సమయం పచ్చని పర్వతాల మధ్య కూర్చొని జలపాతం గలగలలను చూస్తున్నంత ప్రశాంతంగా ఉంటుంది. నీతో కలిసి ఏ చిన్న పని చేసినా, ఎప్పటికీ ముగిసిపోకూడదనుకునే ఒక అందమైన విహారయాత్రలా అనిపిస్తుంది. చలికాలపు పొద్దున ఇష్టమైన వేడి కాఫీని ఆస్వాదిస్తే ఎంత సాంత్వన లభిస్తుందో, నీతో మాట్లాడే మాటలు కూడా నా మనసుకు అంతే హాయినిస్తాయి" అని రాసుకొచ్చారు.

Official Kaala Bhairava And Kavya Kalyanram Announce Marriage With Heartfelt Post and their love story

ఇల్లు అనే కొత్త అర్థం
ప్రారంభంలో ఈ అనుభూతులకు ఎలాంటి పేరు పెట్టాలో అర్థం కాలేదని, అయితే కాలక్రమంలో ఇది కేవలం ఓ ఆకర్షణ మాత్రమే కాదని గ్రహించానని కాలభైరవ పేర్కొన్నారు. "ఈ ప్రయాణంలో నాకు స్పష్టంగా అర్థమైన ఏకైక విషయం.. ఈ భావనలన్నింటికీ ఉన్న ఒకే ఒక్క పేరు ఇల్లు. నిన్న మొదటి సారి కలిసినప్పుడు నేనేదో కొత్త వ్యక్తిని కలిసినట్లు అనిపించలేదు, ఎన్నాళ్ల నుంచో వెతుకుతున్న నా సొంత గూటికి చేరుకున్న భావన కలిగింది. ఆ క్షణం నుంచి నేను ఆ గూటిని వదిలి ఎక్కడికీ వెళ్లలేదు" అని తన ప్రేమను చాటారు కాలభైరవ.

ఓటీటీలోకి వరుణ్ తేజ్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి వరుణ్ తేజ్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

నెటిజన్లు, సినీ ప్రముఖుల శుభాకాంక్షలు
జీవితాంతం ఒకరికొకరం అండగా.. ఒకే ఇంట్లో కలిసి ఉండబోతున్నామనే నిజాన్ని అందరితో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన పోస్టును ముగించారు. 'ఆర్ఆర్ఆర్'లో నాటు నాటు పాటతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న కాలభైరవ.. 'గంగోత్రి', 'ఠాగూర్'లలో బాలనటిగా నటించి 'మసూద', 'బలగం' చిత్రాలతో హీరోయిన్ గా మెప్పించిన కావ్య కల్యాణ్‌రామ్‌ల జంట చూడముచ్చటగా ఉందంటూ సినీ ప్రముఖులు, అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రేమను ఎంతో సున్నితమైన పదాలతో వ్యక్తీకరించిన కాలభైరవ శైలిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+