'OG' ఫేక్ కలెక్షన్లు.. లెక్కలతో సహా బయటపెట్టిన ప్రముఖ జర్నలిస్ట్ (వీడియో)

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యంత స్టైలిష్ ఎఫైర్‌గా వచ్చిన 'ఓజీ' (OG) బాక్సాఫీస్ వద్ద తొలిరోజు రికార్డుల సునామీ సృష్టించినా, వెనక నడుస్తున్న అసలు కథ ఆందోళనకరంగా ఉంది. ఏడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 343 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించినప్పటికీ, కొన్ని కీలక ఏరియాల్లో బయ్యర్లు ఇంకా గండంలోనే ఉన్నారు. రూ. 154 కోట్ల ఓపెనింగ్ డే రికార్డు చూసి సంబరపడ్డ డిస్ట్రిబ్యూటర్లకు, ఆంధ్రా ఏరియాలో (విశాఖ, ఈస్ట్, వెస్ట్, కృష్ణా, నెల్లూరు) మాత్రం నిరాశ తప్పదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

'ఓజీ' కలెక్షన్ల రికవరీకి ప్రధాన అడ్డంకిగా మారింది రిషబ్ శెట్టి 'కాంతార చాప్టర్ 1' ప్రభంజనం. 'కాంతార 1'కు అద్భుతమైన, ఏకగ్రీవమైన పాజిటివ్ టాక్ రావడంతో, దసరా వీకెండ్‌ను అది పూర్తిగా కైవసం చేసుకుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా 'కాంతార' మ్యానియానే కనిపిస్తోంది.

OG Box Office Chaos Makers vs YouTuber on Collections - Will Pawan Kalyan s Film Hit Break-Even

ఒకవైపు 'ఓజీ'కి A సర్టిఫికెట్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ దూరమవడం, మరోవైపు 'కాంతార 1' నుంచి వస్తున్న ఊహించని పోటీ... వెరసి 'ఓజీ' బయ్యర్ల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. ట్రేడ్ అంచనాల ప్రకారం, రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 నుంచి 20 శాతం నష్టాలు తప్పకపోవచ్చు.

మొత్తం మీద, పవర్ స్టార్‌డమ్‌ను మించిన కంటెంట్ పవర్‌ను 'కాంతార 1' చూపించడంతో, 'ఓజీ' బయ్యర్లు బ్రేక్ ఈవెన్ గండాన్ని దాటుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. తాజాగా ప్రముఖ యూట్యూబ్ జర్నలిస్ట్ ఓ వీడియోలో మాట్లాడుతూ..'ఓజీ' చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాలేదని చెప్పుకొచ్చారు. 'ఓజీ' సినిమాకు వచ్చిన కలెక్షన్లను ఏరియాల వారిగా ఆయన వివరించే ప్రయత్నం చేశారు.

సినిమాకు వచ్చిన టాక్‌కు వస్తోన్న కలెక్షన్లకు ఏమాత్రం సంబంధం లేదని ఆయన వివరించారు. ఈ సినిమా ఇప్పటి వరకు 140 కోట్లు సాధించిందని ఆ యూట్యూబ్ జర్నలిస్ట్ స్పష్టం చేశారు. దీంతో మేకర్స్ ప్రకటించిన కలెక్షన్లు వాస్తవమో, యూట్యూబ్ జర్నలిస్ట్ చెప్పిన కలెక్షన్లు వాస్తవమో తెలియక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+