అనోరా.. ఆస్కార్ అవార్డులు కొల్లగొట్టిందిరా- రొమాంటిక్ మూవీ ప్రభంజనం

Oscar Awards 2025: హాలీవుడ్‌లో బిగ్గెస్ట్ వేడుక.. ఆస్కార్ అవార్డుల సందడి గ్రాండ్‌గా ఆరంభమైంది. ఇది 97వ ఎడిషన్. భారత కాలమాన ప్రకారం ఈ తెల్లవారు జామున సరిగ్గా 5:30 గంటలకు ఈ ప్రదానోత్సవం ప్రారంభమైంది. స్టార్ మూవీస్ సెలెక్ట్, స్టార్ మూవీస్‌తో పాటు జియో హాట్ స్టార్‌ దీన్ని లైవ్ స్ట్రీమింగ్ చేస్తోన్నాయి. అమెరికా కాలిఫోర్నియాలోని డాల్బీ థియేటర్ దీనికి వేదిక.

అమెరికాకు చెందిన ప్రముఖ కమేడియన్, రైటర్, టెలివిజన్ హోస్ట్ కానన్ ఓబ్రియాన్ కానన్ ఓబ్రియాన్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహరించారు. తన దైన శైలిలో నవ్వులు పూయించారు. రాబర్ట్ డౌనీ జూనియర్, సెలెనా గోమెజ్, ఆడ్రియాన్ బ్రాడీ, జార్జియానా ఛాప్‌మన్, ఎమ్మా స్టోన్, అమీ పోహ్లెర్.. వంటి సెలెబ్రిటీలు రెడ్ కార్పెట్‌పై మెరిశారు.

Oscars 2025 Anora took home 5 awards

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డును అమెరికాకు చెందిన పాల్ టేజ్‌వెల్ గెలుచుకున్నారు. విక్డ్ సినిమా ఆయనకు ఈ అవార్డును తెచ్చి పెట్టింది. ది బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు.. ఫ్లోకు దక్కింది. బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ అవార్డును ఇన్ ద షాడో ఆఫ్ ది సైప్రెస్ దక్కించుకుంది. షిరిన్ సొహానీ, హొస్సైన్ మోలయెమి ఈ అవార్డును అందుకున్నారు.

ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అవార్డును అందుకున్నారు కీరన్ కుల్కిన్స్. ది రియల్ పెయిన్ సినిమాలో ప్రదర్శించిన నటనకు ఆయనకు ఈ పురస్కారం లభించింది. బెస్ట్ పిక్చర్ అవార్డుల జాబితాలో అనోరా ప్రభంజనం కనిపించింది. మొత్తం అయిదు అవార్డులను కొల్లగొట్టింది.

అనోరాలో లీడ్ క్యారెక్టర్‌లో నటించిన మికీ మ్యాడిసన్ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే- ఇదే చిత్రానికి దర్శకత్వం వహించిన సీన్ బేకర్‌కు మూడు విభాగాల్లో పురస్కారాలను అందుకున్నాడు. ఉత్తమ దర్శకుడు, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, బెస్ట్ ఎడిటింగ్ అవార్డులు అనోరాకే దక్కాయి.

ఉత్తమ చిత్రం కేటగిరీలో అనోరాతో పాటు ఎమిలియా పెరెజ్, ది సబ్‌స్టాన్స్, డ్యూన్: పార్ట్ 2, విక్డ్, నికెల్ బాయ్స్, కాంక్లేవ్, ఐయామ్ స్టిల్ హియ్, ది బ్రూటలిస్ట్, ఎ కంప్లీట్ అన్‌నోన్.. పోటీ పడ్డాయి. మిగిలిన వాటికి వేర్వేరు కేటగిరీల్లో అవార్డులు లభించాయి. బెస్ట్ ఫిల్మ్ పురస్కారాన్ని అనోరా కైవసం చేసుకుంది.

ఆస్కార్ ఉత్తమ నటుడి అవార్డు ఆడ్రియాన్ బ్రాడీని వరించింది. ది బ్రూటలిస్ట్ సినిమాలో ప్రదర్శించిన నటనకు ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికాలోని భయానక పరిస్థితుల నుంచి బయటపడే జెవిష్- హంగేరియన్‌గా అధ్భుతంగా నటించాడు బ్రాడీ.

బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే అవార్డును సీన్ బేకర్ సొంతం చేసుకున్నారు. అనోరా మూవీకి గాను ఈ అవార్డు లభించింది. ది బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే పురస్కారాన్ని కంక్లేవ్ మూవీ సొంతం చేసుకుంది. బెస్ట్ ఫిల్మ్ అవార్డు కోసం కూడా ఈ సిినిమా నామినేట్ అయింది. ది సబ్‌స్టాన్స్ మూవీకి బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ అవార్డు లభించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+