ఓటీటీని షేక్ ఆడిస్తున్న క్రైం థ్రిల్లర్ సిరీస్.. అన్నీ తల లేని శవాలే!

ఓటీటీ ప్రియులకు థ్రిల్లర్ సినిమాలంటే ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా సస్పెన్స్, మర్డర్ మిస్టరీ కథాంశాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. వీకెండ్ వచ్చిందంటే చాలు.. థియేటర్ల కంటే కూడా ఓటీటీల్లో ఎలాంటి కొత్త థ్రిల్లర్లు అందుబాటులోకి వచ్చాయా అని వెతికే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

అలాంటి థ్రిల్లర్ లవర్స్ కోసం ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త తెలుగు ఇన్వెస్టిగేటివ్ డ్రామా 'రుద్రవనం PS'. నరేష్ అగస్త్య కథానాయకుడిగా, శశిధర్ మున్నంగి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జీ5' లో స్ట్రీమింగ్ అవుతోంది. టీజర్, ట్రైలర్‌లతోనే భారీ ఆసక్తిని రేకెత్తించిన ఈ సిరీస్‌కి ఐఎమ్‌డీబీ లో 7.2 రేటింగ్ లభించడం విశేషం.

వెంకటేష్ - త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
వెంకటేష్ - త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
OTT Sensation This Gripping Crime Thriller Revolves Around Headless Corpses

కథేంటంటే?

రుద్రవనం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరి తర్వాత ఒకరుగా మొత్తం 8 మంది అనుమానాస్పద రీతిలో అదృశ్యమవుతారు. అడవిలో ఒక తలలేని శవం దొరకడం, అదృశ్యమైన వారిలో స్థానిక ఎమ్మెల్యే భైరవులు సోదరుడు కూడా ఉండటంతో ఈ కేసు తీవ్ర సంచలనంగా మారుతుంది. ఈ మిస్టరీని ఛేదించే బాధ్యతను సబ్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్ (నరేష్ అగస్త్య), సీఐ వేణుగోపాల్ (బెనర్జీ) చేపడతారు. అసలు ఆ 8 మందిని ఎవరు కిడ్నాప్ చేశారు? వారి మరణాల వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? ఈ క్రమంలో బయటపడిన నిజాలేంటి? అనేదే ఈ సిరీస్ అసలు కథ.

18 ఏళ్ల జర్నీకి కొత్త మలుపు.. ఓటీటీ ఎంట్రీతో సంచలనం!
18 ఏళ్ల జర్నీకి కొత్త మలుపు.. ఓటీటీ ఎంట్రీతో సంచలనం!

ఎలా ఉందంటే?

మొత్తం 7 ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్ రన్ టైమ్ దాదాపు 2 గంటల 50 నిమిషాలు. కథనం ఎక్కడా పెద్దగా బోర్ కొట్టకుండా ఒకే ఫ్లోలో సాగుతుంది. మరీ విపరీతమైన ట్విస్టులు లేకపోయినా, వీక్షకులను కథలో లీనం చేయడంలో ఈ సిరీస్ సక్సెస్ అయింది. ఈ సిరీస్‌ను రోజుకొక ఎపిసోడ్ చొప్పున విడతలవారీగా కంటే.. ఒక్క సిట్టింగ్‌లోనే పూర్తి చేస్తేనే దీని అసలైన థ్రిల్ అనుభూతికి వస్తుంది. క్రైమ్, మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ కథలను ఇష్టపడే వారికి ఈ వీకెండ్‌లో 'రుద్రవనం PS' ఒక మంచి ఛాయిస్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+