రామ్ చరణ్ రికార్డును బద్ధలు కొట్టిన ప్రభాస్
జూనియర్ ఎన్టీఆర్ సినిమా అరవింద సమేత 2018లో విడుదలైంది. ఆ సినిమా సీడెడ్ లో మొదటిరోజు భారీ కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత సీడెడ్ గడ్డపై ఆ రికార్డును అధిగమించడానికి చాలా సినిమాలు ప్రయత్నించినప్పటికీ దాన్ని అధిగమించలేకపోయాయి. 2019 జనవరి 11న విడుదలైన వినయ విధేయ రామ సినిమా మొదటిరోజు అరవింద సమేత వీరరాఘవ సినిమా ఓపెనింగ్ డే రికార్డుని బద్దలు కొట్టింది అనే టాక్ ఉంది.
రామ్ చరణ్-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. ఓపెనింగ్స్ బాగున్నా టాక్ బాగా రాకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర నష్టాలు మిగిల్చింది. సీడెడ్ ఏరియాలో ఈ సినిమా మొదటిరోజు ఏడున్నర కోట్ల రూపాయలను రాబట్టింది. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఈ రికార్డు బద్దలు కాబోతోంది. వినయ విధేయ రామ సీడెడ్ రికార్డును బ్రేక్ చేయడానికి సలార్ సిద్ధమయ్యాడు.

ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం.. అందులోను పక్కా మాస్ యాక్షన్ సినిమా కావడంతోపాటు భారీ యాక్షన్ ఎపిసోడ్స్, భారీస్థాయిలో విడుదల కానుండటంలాంటివన్నీ కలిసి ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. సీడెడ్ ఏరియాలో కొత్త బెంచ్ మార్క్ ను సృష్టించబోతోంది. సీడెడ్ లోని ప్రధాన థియేటర్లలో, మల్టీప్లెక్స్ ల్లో భారీస్థాయిలో విడుదల కాబోతోంది. కచ్చితంగా రామ్ చరణ్ రికార్డును సలార్ బద్దలు కొడతాడనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. ఓపెనింగ్ డే కలెక్షన్ల పరంగా చూసినా సులువుగా ఈ సినిమా రికార్డు బ్రేక్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. రూ.800 కోట్ల బ్రేక్ ఈవెన్ సాధించాలనే లక్ష్యంతో సలార్ బరిలోకి దిగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి.












Click it and Unblock the Notifications