భారతీయ సినీ ఇండస్ట్రీలో అరుదైన రికార్డు నెలకొల్పిన ప్రభాస్
పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ గురించి చెప్పాలంటే ఎన్నిపేజీలు రాసినా సరిపోదు. ప్రభాస్ సినీ జీవితాన్ని విభజించి చూస్తే బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అని రాయాలి. బాహుబలి తర్వాత నుంచి మొన్న విడుదలైన కల్కి వరకు అన్నీ భారీ బడ్జెట్ సినిమాలే రూపొందుతున్నాయి. దేశం మొత్తంమీద భారీ బడ్జెట్ చిత్రాలకు ఈ బాహుబలి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ హీరోగా చెలామణి అవుతున్నాడు. హిందీలో ఉన్న ఖాన్ త్రయాన్ని పూర్తిగా వెనక్కి నెట్టేశారు.
ఇండియాలో అరుదైన రికార్డు
అటువంటి ప్రభాస్ మన తెలుగు సినీ పరిశ్రమలో అరుదైన రికార్డును నెలకొల్పారు. తన నుంచి వచ్చిన ఐదు సినిమాలు రూ.200 కోట్ల కంటే ఎక్కువ షేర్ వసూలు చేసిన రికార్డును సొంతం చేసుకున్నాయి. భారతదేశ సినీ చరిత్రలో ఇంతవరకు ఏ హీరో కూడా ఇటువంటి రికార్డును నెలకొల్పలేదు. బాహుబలి, బాహుబలి2, సాహో, సలార్, కల్కి సినిమాలతో ప్రభాస్ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆదిపురుష్ సినిమా ఫ్లాపైనా రూ.150కోట్లకు పైగా షేర్ వసూలు చేయడం విశేషం. దీంతో కలుపుకుంటే ప్రభాస్ నటించిన ఆరు సినిమాలు రూ.150 కోట్లకు పైగా షేర్ సాధించాయి. ప్రస్తుతం డార్లింగ్ రికార్డును బద్దలుకొట్టే సాహసం ఏ హీరోకూడా చేయలేరని చెప్పొచ్చు.

వరుసగా లైన్ లో ఉన్న సినిమాలు
ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రం ప్రారంభం కాబోతోంది. రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ తన కెరీర్ లో తొలిసారిగా పోలీసు అధికారిగా నటిస్తున్నారు. దీనితర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2 చేయాల్సి ఉంది. ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్ దీన్ని పట్టాలెక్కించే అవకాశం ఉంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత కల్కి2 ఉండబోతోంది. రాజాసాబ్ కు, స్పిరిట్ కు మధ్యలో హను రాఘవపూడి సినిమాను పూర్తిచేసి విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు ఫౌజీ అనే పేరు పరిశీలిస్తున్నారు.












Click it and Unblock the Notifications