పెరిగిన ప్రభాస్ ఆస్తులు... విలువ ఎంతంటే?
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. వరుసగా అన్నీ భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. డిసెంబర్ 22న సలార్ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడంతోపాటు బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
తండ్రి గోపికృష్ణ మూవీస్ బ్యానర్ నిర్మాణ సంస్థ, పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు వంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వారసుడిగా ప్రభాస్ సినిమాల్లోకి అడుగు పెట్టాడు. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ మొదటి సినిమా ఈశ్వర్‌కే ఉపయోగపడింది. తర్వాత తాను ఎంతో కష్టపడి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

బాహుబలి రెండు చిత్రాలకు ముందు ప్రభాస్ పారితోషికం చాలా తక్కువ. అప్పుడు ప్రభాస్ నెట్ వర్త్ సుమారు రూ. 124 కోట్లు (15 మిలియన్ డాలర్స్)గా ఉన్నట్లు అంచనా. బాహుబలి తర్వాత ప్రభాస్ ఇమేజ్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు తీసుకుంటున్నాడు. దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న తొలి భారతీయ నటుడు కూడా ఆయనే. రూ.100 కోట్ల పారితోషికం అందుకున్న మొదటి హీరోగా రికార్డు సృష్టించాడు. ఆదిపురుష్ సినిమా కోసం రూ.120 కోట్లు తీసుకున్నాడు. కల్కి సినిమా కోసం రూ.150 కోట్లు, సలార్ కు రూ.100 కోట్లతోపాటు లాభాల్లో పదిశాతం రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడు. బాహుబలి సినిమాకు ముందు ఆస్తుల విలువ రూ.124 కోట్లుగా ఉంటే ఆ తర్వాత ఒక్కో సినిమకే రూ.150 కోట్లు తీసుకుంటున్నాడంటే ఆస్తులు ఏవిధంగా పెరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications