బోల్డ్ సీన్‌లో నటించబోతున్న ప్రభాస్?
పాన్ ఇండియా డార్లింగ్, యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి చిత్రం చేస్తున్నారు. ఈనెల 27వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతోంది. వైజయంతీ మూవీస్ పతాకంపై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి.అశ్వనీదత్ దీన్ని నిర్మిస్తున్నారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు కొల్లగొట్టాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి భారీ తారాగణం ఈ చిత్రంలో పాలుపంచుకుంది. కల్కి తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చేయబోతున్నారు ప్రభాస్.
సందిగ్ధంలో ప్రభాస్
కల్కి విడుదలైన వెంటనే స్పిరిట్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. కథ ప్రకారం ఈ సినిమాలో బెడ్‌రూమ్‌లో బోల్డ్ సన్నివేశం చేయాల్సి ఉంది. కథ ప్రకారం దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ విషయాన్ని సందీప్ రెడ్డి డార్లింగ్‌కు చెప్పారు. కచ్చితంగా ఈ సన్నివేశం చేయాల్సి ఉంటుందని చెప్పారు. అయితే చేయాలా? వద్దా? అనే సందిగ్ధతలో ప్రభాస్ ఉన్నారు. కథ ప్రకారం చూస్తే చేస్తారంటున్నారు.

కథ ప్రకారం తప్పనిసరి
స్పిరిట్ కు ముందు తీసిన యానిమల్ సినిమాలో కూడా కథ ప్రకారం బెడ్ రూమ్ సన్నివేశంలో రణబీర్ కపూర్ నటించారు. ఆ సన్నివేశం సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది. రూ.900కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. స్పిరిట్ చిత్రంద్వారా రూ.2 వేల కోట్ల కలెక్షన్లు రాబట్టాలని సందీప్, ప్రభాస్ టార్గెట్ పెట్టుకున్నారు. ప్రభాస్ కు మహిళల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. స్పిరిట్ లో బోల్డ్ సన్నివేశం చేస్తే వారు అంగీకరిస్తారా? లేదా? అనే సందిగ్ధంలో ప్రభాస్ కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది. అయితే సందీప్ మాత్రం డార్లింగ్ పై ఒత్తిడి తెస్తున్నాడని తెలుస్తోంది. దాదాపుగా ఈ సినిమాలో ప్రభాస్ నటించే బోల్డ్ సీన్ ఉంటుందనే అంటున్నారు. అలా అయితే సరికొత్త ప్రభాస్ ను మనం చూస్తామని అర్థమవుతోంది. అంతర్జాతీయ స్థాయిలో కల్కి ఘనవిజయం సాధిస్తే స్పిరిట్ చిత్రాన్ని కూడా ప్రపంచంలోని పలు భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.












Click it and Unblock the Notifications