ఫ్యాన్ వార్స్ పెట్టుకోకండి.. నాతో ఆడుకుంటున్నారు - పవన్

పవన్ కళ్యాణ్ "ఓజీ" సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాలే కాకుండా, ఓవర్సీస్ లో కూడా పవన్ మార్కెట్‌ను మరోసారి నిరూపిస్తోంది. డైరెక్టర్ సుజీత్ పవన్‌ను పూర్తిగా న్యూ అవతార్‌లో చూపించారు. ఈ మూవీ లేటెస్ట్ గా 300 కోట్లు కలెక్షన్ సాధించింది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్రబృందంతో పాటు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే అభిమానులను సీరియస్ రిక్వెస్ట్ చేశారు.

ఫ్యాన్ వార్స్ పెట్టుకోకండి..

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. దయచేసి ఫ్యాన్ వార్స్ పెట్టుకోకండి అని విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్ వార్స్ ఆపేయండి.. నేను కళను ప్రేమించే వాడిని అన్నారు. మేము సినిమాల కోసం చాలా కష్టపడుతూ ఉంటాం. కొన్నిసార్లు ఇంట్లో వాళ్లతో తిట్లు తింటాం. కుటుంబ సభ్యులతో కూడా సరిగ్గా ఉండలేం. సుజీత్ ఒక నెల రోజుల వరకు ఇంటికి కూడా వెళ్లలేదు అంటూ గుర్తు చేశారు.

pawan-kalyan-comments-on-fan-wars-at-og-success-meet-event

ఇదివరకు రోజుల్లా 50, 100 రోజులకు ఫంక్షన్స్ చేసేవాళ్లం. ఇప్పుడు ఆరు రోజులకే చేయాల్సి వస్తుంది. దయచేసి ఈ ఫ్యాన్ వార్స్ ఆపేసి, ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకుందామని పిలుపునిచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా తాను ఇతర హీరోల అభిమానులను కలుపుకునే ప్రయత్నం చేశానని, అలాగే తనని తాను తగ్గించుకుంటూ, 'నేను వీళ్లందరి కంటే చాలా చిన్న హీరోని' అని వర్తమాన స్టార్ల పేర్లను కూడా ప్రస్తావించిన సంగతిని గుర్తుచేశారు.

సరదా వ్యాఖ్యలు..

తన కెరీర్‌లో ఎప్పుడూ చేయని విధంగా దర్శకుడు సుజీత్, తమన్ తనను ఈవెంట్‌ల కోసం సిద్ధం చేశారని పవన్ కళ్యాణ్ సరదాగా వ్యాఖ్యానించారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు కటానా (ఖడ్గం) పట్టుకుని రమ్మన్నారని.. పైగా వర్షం పడటంతో హడావిడి అయ్యిందని గుర్తు చేసుకున్నారు. ఇక ఇప్పుడేమో సక్సెస్ మీట్‌కు బ్లాక్ డ్రెస్సు, కళ్లజోడు, గన్ పట్టుకొని రావాలని చెప్పడంతో.. "చంపేస్తా" అని అన్నట్లు తెలిపారు. గన్‌లు, కత్తులంటే తనకు ఉన్న వీక్‌నెస్‌తో అందరూ తనతో ఆడుకుంటున్నారని నవ్వుతూ పేర్కొన్నారు.

సుజిత్ పై ప్రశంసలు..

దర్శకుడు సుజిత్‌లో తనకు తాను కనిపిస్తానని పవన్ కళ్యాణ్ కొనియాడారు. యంగ్ డైరెక్టర్ల గురించి త్రివిక్రమ్‌తో చర్చించే క్రమంలో సుజీత్ ప్రస్తావన వచ్చిందని తెలిపారు. సుజీత్ తనకు ఇప్పటివరకు కథ చెప్పలేదని... స్టోరీ కన్నా ముందు విజువల్స్ చూపించేవాడని చెప్పారు. 'జానీ' సినిమా ఫెయిల్యూర్ కాబట్టి దాని రిఫరెన్స్ 'ఓజీ'లో పెట్టడంతో మొదట్లో కొద్దిగా టెన్షన్ పడ్డానని.. కానీ కొన్నిసార్లు నమ్మి ముందుకు వెళ్లిపోవడమే మంచిదని భావించానని చెప్పుకొచ్చారు. ఎలాంటి బరువు లేకుండా ఈ సినిమాలో నటించానని, అద్భుతమైన సంగీతం అందించిన తమన్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

'ఓజీ'కి సీక్వెల్‌, ప్రీక్వెల్‌పై అనౌన్స్ మెంట్..

ఇక పవన్ కళ్యాణ్ తన ప్రసంగం చివర్లో అభిమానులకు శుభవార్త చెప్పారు. ఇటీవల తాను థియేటర్‌లో 'ఓజీ' సినిమా చూస్తున్న సమయంలో.. ఈ సినిమాకు తప్పకుండా సీక్వెల్, ప్రీక్వెల్ చేస్తానని దర్శకుడు సుజీత్‌కు మాటిచ్చినట్లు ప్రకటించారు. అయితే, వాటికి కొన్ని షరతులుంటాయని కూడా పేర్కొన్నారు. దీంతో పవన్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+