ఇది సార్ పవన్ కళ్యాణ్ రేంజ్.. " ఓజీ " ఫస్ట్ టికెట్ రూ.5 లక్షలకి సేల్ !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం "ఓజీ (OG)". ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలోనూ ఫుల్ క్రేజ్ ఉంది. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
భారీ కాస్టింగ్..
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనుండగా, సిరి లేళ్ల (నారా రోహిత్ కాబోయే భార్య), అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ వంటి పలువురు ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న తరుణంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది. ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్‌తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసిన మెలోడీ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సెప్టెంబర్ 18 లేదా 19న ఆంధ్రప్రదేశ్‌లో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు.
కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా వరుసగా అప్‌డేట్స్ వస్తున్నాయి. "ఉస్తాద్ భగత్ సింగ్" టీం ఒక క్రేజీ పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కి గిఫ్ట్ ఇస్తే, ఇక ఇప్పుడు "ఓజీ" టీం కూడా అదిరిపోయే సర్ప్రైజ్ రెడీ చేస్తోందని టాక్ వినిపిస్తోంది.
రికార్డ్ రేటు..
ఇక ఓజీ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణ నైజాంలో మూవీ తొలి టికెట్‌ను వేలం వేయగా, ఆ టికెట్ ధర అక్షరాల రూ. 5 లక్షలు పలికింది. ఈ టికెట్‌ను ఓ పవన్ కళ్యాణ్ అభిమాని సొంతం చేసుకున్నాడు. నార్త్ అమెరికాలోని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టీమ్ ఈ ఫస్ట్ టికెట్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఒక్క సినిమా టికెట్ ధర అంత రేంజ్‌లో ఉండటం పవన్ క్రేజ్‌కి నిదర్శనం.
మూవీపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి. త్వరలోనే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. ట్రేడ్ సర్కిల్స్ అంచనా ప్రకారం.. ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే కాదు, టాలీవుడ్ బాక్సాఫీస్ హిస్టరీలో కూడా కొత్త రికార్డులు సృష్టించే అవకాశముంది.












Click it and Unblock the Notifications