గుంటూరు కారం రిజెక్ట్ చేసిన హీరో
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా గుంటూరు కారం సినిమా రూపుదిద్దుకుంటోంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటినుంచి ప్రతిరోజు వార్తల్లో నిలుస్తూనే ఉంది. మొదట పూజా హెగ్డేను హీరోయిన్ గా ఎంపిక చేశారు. సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ఆమె తప్పుకుంది.
పూజా స్థానంలో మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారు. తర్వాత తమన్ తప్పుకుంటున్నాడంటూ మరో వార్త వచ్చింది. దీని తర్వాత డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ కూడా మారాడు. తర్వాత మహేష్ బాబు విదేశాలకు వెళ్లాడు. త్రివిక్రమ్ పవన్ కల్యాణ్ సినిమాలకు సంబంధించిన వ్యవహారాలను చూస్తూ బిజీగా ఉన్నాడు.

ఇన్ని సంఘటనల మధ్య ఈ సినిమా అసలు షూటింగ్ జరుపుకుంటుందా? చెప్పిన తేదీకి విడుదలవుతుందా? అంటూ అభిమానులు ఆందోళన చెందేవారు. ఎట్టకేలకు వారిని సంతృప్తి పరుస్తూ లిరికల్ ఆడియో విడుదల చేశారు.

వాస్తవానికి ఈ సినిమాకు ముందుగా అనుకున్న హీరో పవన్ కల్యాణ్ అట. ఆయన్ను కలిసి కథన వినిపించిన త్రివిక్రమ్ కు నిరాశే ఎదురైంది. రాజకీయంగా బిజీగా ఉండటంతో ఈ సినిమాను పవన్ సున్నితంగానే తిరస్కరించాడు. పవన్ వద్దన్న తర్వాత మహేష్ బాబు దగ్గరకు చేరింది. అతడు, ఖలేజా తర్వాత త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. పడుతూ లేస్తూ షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం గుంటూరు కారం అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కు గురవుతోంది.












Click it and Unblock the Notifications