బ్రో రెండు టికెట్లు ప్లీజ్.. ఏ థియేటర్ అయినా ఓకే..

తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. దాదాపు ఆరు నెలల తర్వాత థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు మూవీ ప్రపంచవ్యాప్తంగా జులై 24న విడుదలకు సిద్ధం అయింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో హరిహర వీరమల్లు ర్యాంపేజ్ నడుస్తోంది. అడ్వాన్స్ డ్ బుకింగ్స్ హవా నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. దాదాపు ఐదేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

ఏపీలో హరి హర వీరమల్లు సినిమాకు టికెట్ రేట్లు అప్పర్ క్లాస్..150 రూపాయలు, లోయర్ క్లాస్ 100 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 200 రూపాయలు మాత్రమే పెంచుకునేలా అనుమతులు వచ్చాయి. ఇక ప్రీమియర్ షో రాత్రి 9 గంటలకు అనుమతి ఇచ్చారు. దానికి 600 పెంచుకునేలా అనుమతి ఉంది. అటు తెలంగాణలోనూ ముందు రోజు రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోకి అనుమతి ఇస్తూ 600 రూపాయలు టికెట్ రేటు పెంచుకోడానికి అనుమతి ఇచ్చారు. ఇక జులై 24 నుంచి 28 వరకు మల్టిప్లెక్స్ లకు 200 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ కు 150 రూపాయలు పెంచారు. జులై 28 నుంచి ఆగస్టు 2 వరకు 150 రూపాయలు మల్టిప్లెక్స్ లకు, 106 రూపాయలు సింగిల్ స్క్రీన్స్ కు పెంచారు.

Pawan Kalyan s Harihara Veeramallu Storms Telugu States with Record-Breaking Advance Bookings

ఇక ఓవర్సీస్‌ లో ఈ సినిమా విడుదల విషయంలో చిన్న గందరగోళం ఏర్పడింది. డిజిటల్‌ ప్రింట్‌ అందలేదని విదేశీ నిర్మాణసంస్థ పోస్ట్‌ పెట్టింది. తాజాగా లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ర్యాంపేజ్ మోడ్ లో ఉన్నారు. ఈ సినిమా మొదటి భాగం 1గంట 26 నిమిషాల 40 సెకన్లు, రెండో భాగం 1గంట 18 నిమిషాల 25 సెకన్లు అని విదేశీ నిర్మాణసంస్థ పేర్కొంది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా, బాబీ దేవోల్, సత్యరాజ్, నాసర్, వెన్నెల కిషోర్, సునీల్, పూజిత పొన్నాడ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే తెలుగు వెర్షన్‌కు 48 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. తెలుగు సినీ చరిత్రలో ఒక్క రోజులో అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్‌ గా నిలిచింది. అన్ని భాషల్లో కలిపితే ట్రైలర్‌ కు మొత్తం 61.7 మిలియన్ల వ్యూస్ వచ్చినట్టు నిర్మాతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+