జూనీయర్ ఎన్‌టీఆర్‌కు వీడియో కాల్ చేసిన పవన్ కల్యాణ్ మాజీ భార్య..
నటి రేణుదేశాయ్ పరిచయం అక్కర్లేని పేరు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య గానే కాకుండా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. రేణుదేశాయ్ కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా, మోడల్‌గా, నటిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. తెలుగులో బద్రి, జానీ వంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత పవన్ స్టార్‌తో పెళ్లి, విడాకుల తర్వాత పిల్లలతో కలసి వేరుగా ఉంటున్నారు. ఇక, ఈ మధ్యకాలంలో రేణుదేశాయ్ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండడం మనం చూస్తున్నాం. పిల్లలు అకీరా, ఆద్యలకు గురించి సోషల్‌మీడియాలోని తన ఖాతాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే, తాజాగా రేణుదేశాయ్ గురించి ఓ వార్త సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటీ అనుకుంటున్నారా..? రేణు దేశాయ్ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు వీడియో కాల్ చేశారట.. మరీ వీడియోకాల్ లో రేణుదేశాయ్ ఏం మాట్లాడిందని చాలామంది సందేహంగా ఉంటుంది కదా? అదేంటో తెలుసుకుందాం.
జూనీయర్ ఎన్‌టిఆర్‌తో రేణుదేశాయ్ వీడియో కాల్ లో ఏం మాట్లాడిందంటే..? ఎన్‌టిఆర్ నటిస్తోన్న దేవర చిత్రం నుంచి ఇటీవలే ఓ రొమాంటిక్ సాంగ్ విడుదలయిన సంగతి తెలిసిందే కదా.. ఆ సాంగ్‌కు గురించి మాట్లడాడానికి కాల్ చేసిందట. దేవర సాంగ్స్‌కు, పోస్టర్లకు మంచి ఆదరణ లభిస్తుందని, ఆ విషయం రేణు దేశాయ్‌కు ఎంతో సంతోషాన్నిస్తుందని ఎన్టీఆర్‌తో వీడియో కాల్ లో చెప్పిందట రేణుదేశాయ్. అంతేకాదు. ఎన్‌టీఆర్ మొదటిసారి ఇలాంటి రొమాంటిక్ లుక్‌లో కనిపించాడని చెప్పిందట. దేవర నుంచి రీలీజయిన పాటలన్నీ ఎంతో బాగున్నాయని తారక్‌కు చెప్పిందట. ఈ సినిమా సాంగ్స్‌పై ఎన్ని ట్రోల్స్ వచ్చిన పట్టించుకోవద్దని ఎన్‌టీఆర్‌కు ధైర్యం చెప్పిందట.

ఎన్‌టీఆర్ గురించి కామెంట్లు..
గతంలో కూడా రేణుదేశాయ్ ఎన్టీఆర్ గురించి చాలా సందర్భాల్లో కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఎన్‌టీర్ అకీరా, ఆద్యలను కలిసేందుకు అప్పడప్పుడూ వస్తుంటారని, తనను సినిమాల్లో నటించమని చాలాసార్లు మోటివేట్ చేసేవారని పలు సందర్భాల్లో రేణు దేశాయ్ చెప్పారు. ప్రస్తుతం రేణు దేశాయ్ జూనీయర్ ఎన్టీఆర్‌తో మాట్లాడిన మాటలు కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications