'నన్ను ట్రై చేయండి'... హీరోయిన్ బంపర్ ఆఫర్

కన్నడలో ఒక ప్రాంతీయ సినిమాగా విడుదలై పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది కాంతార. హీరోగా, దర్శకుడిగా రిషభ్ శెట్టి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం కాంతార 2ని గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నాడు. కాంతార సినిమాకు ముందు జరిగిన కథను చెబుతూ ప్రీక్వెల్‌గా కాంతార2ని రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన కాంతార చాప్టర్ 1 ఫస్ట్ లుక్ టీజర్ గూస్ బంప్స్ తెప్పించింది.

ఈ సినిమాకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇందులో మరికొన్ని పాత్రల కోసం ఆడిషన్స్ ఓపెన్ చేశారు. 30 నుండి 60 సంవత్సరాల వయసున్న పురుషులు, 18 నుండి 60 సంవత్సరాల వయసున్న మహిళలు ఈ ఆడిషన్స్‌కి రావచ్చ. kantara.film అనే సైట్‌లో ప్రొఫైల్స్‌ను అప్ లోడ్ చేయాలి. ఈ ఆడిషన్ కాల్ చూసిన తర్వాత హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్.. ఆడిషన్ కోసం ఓపెన్ గా నన్ను ట్రై చేయండి అని ట్వీట్ చేసింది.

payal rajput request to hero rishab shetty

I'm interested in being part of this outstanding film. Please consider me for an audition. This message is on my behalf.. అని కాంతార2 ఆడిషన్స్‌కు బదులిచ్చింది. ఆ తర్వాత "@shetty_rishab @hombalefilms... I've learned that auditions are being held for Kantara Chapter 1. I am eager to contribute to this esteemed project. My recent film, Mangalavaaram, has garnered significant praise for my performance.

I would appreciate if you could spare some time to watch the film. Please advise on the audition process for this project. Thanks to all my fans for reposting and pushing my name 🙏🏼♥️🙏🏼means a lot 🦋" అంటూ రాసుకొచ్చింది. మంగళవారం సినిమాలో తన నటనకు ప్రశంసలు వచ్చాయని, అది చూసిన తర్వాతైనా కాంతార 2లో అవకాశం ఇవ్వాలని కోరింది. రిషబ్ శెట్టి ఈ అమ్మడి కోరిక మేరకు ఛాన్స్ ఇస్తాడేమో వేచిచూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+