యంగ్ టైగర్, కాంతార హీరో, సలార్ డైరెక్టర్ తో ప్లాన్, కేజీఎఫ్ నిర్మాత, ఏం జరుగుతోంది ?
హోంబలే ఫిల్మ్స్ భారీ చిత్రాలను నిర్మిస్తోంది. భాష హద్దులు దాటి పాన్ ఇండియా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో పాటు ఇప్పుడు స్టార్ నటీనటులు, సాంకేతిక నిపుణులను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. తాజాగా కేజీఎఫ్ సిరీస్ తో పాటు సలార్ లాంటి సినిమాలను అందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే జూనియర్ ఎన్టీఆర్, కాంతార సినిమా హీరో, ఆ సినిమా దర్శకుడు రిషబ్ శెట్టి, సలార్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒకే చోట ప్రత్యక్షం కావడం హాట్ టాపిక్ అయ్యింది.
కాంతార సినిమాకు దర్శకత్వం వహించి ఆ సినిమాలో హీరోగా నటించిన రిషబ్ శెట్టి, సలార్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. రిషబ్ శెట్టి-తారక్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు కలుసుకున్నారు ? అని పెద్ద ఎత్తున చర్చ మొదలుపెట్టారు.

బెంగళూరులోని ప్రశాంత్ నీల్ ఇంట్లో తీసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తారక్ తదుపరి చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. హోంబాలే సంస్థ నిర్మిస్తున్న సినిమాలో రిషబ్ శెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. సాలార్-2 చిత్రం పనుల్లో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్‌ను హోంబలే సంస్థ నిర్మిస్తోంది. ఎవరి సినిమా పనుల్లో వాళ్లు బిజీగా ఉన్న సయంలోనే బెంగళూరులోని ప్రశాంత్ నీల్ ఇంట్లో జరిగిన కార్యక్రమానికి వీళ్లు హాజరైనారు.
జూనియర్ ఎన్టీఆర్, రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో హోంబాలే సంస్ధ నిర్మాత విజయ్ కిరంగదూర్ కొత్త సినిమా నిర్మిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తారక్. రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో కొత్త సినిమా విషయంపై ఎలాంటి చర్చ జరగలేదని తెలుస్తుంది. ప్రశాంత్ నీల్, లిఖితా నీల్, తారక్, ఆయన సతీమణి ప్రణతితో కలిసి జంటలుగా కలిసి తీసుకున్న ఫోటోలు బయటకు రావడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.\

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయిన తరువాతే అంటే సలార్ కు ముందే ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా అనౌన్స్ చేసారు. కొన్ని కారణాల వల్ల ఆసినిమా ఆలస్యం అవుతోంది. దేవర', వార్ 2' చిత్రాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నీల్ దర్శకత్వంలో నటించనున్నారు. సాలార్ సక్సెస్ తర్వాత ప్రశాంత్ నీల్ సీక్వెల్ ప్లాన్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత తారక్ టాలెంటెడ్ డైరెక్టర్ సినిమాలో నటించే అవకాశం ఉంది.
రిషబ్ శెట్టి కాంతార సక్సెస్ వేవ్‌లో దూసుకుపోతున్నాడు. కాంతార 2 కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యింది. ఇక ఐదేళ్లలో సినిమా రంగంలో 3 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు హోంబాలే సంస్థ నిర్మాత విజయ్ కిరగందూర్ ప్రకటించారు. కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో కూడా హోంబాలే సంస్థ సినిమాలను నిర్మిస్తోంది. త్వరలో రిచర్డ్ ఆంటోనీ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications