స్టార్ హీరోకు చెమటలు, హత్య కేసులో కీలక వీడియో సాక్షం, మొబైల్ లో షేర్ చేసి ?
చిత్రదుర్గ నివాసి రేణుకాస్వామి హత్యకేసుకు సంబంధించి కన్నడ స్టార్ హీరో దర్శన్‌కు చిక్కులు ఎదురైనాయి. బెంగళూరులోని పట్టనగెరె నివాసి వినయ్ మొబైల్ ఫోన్‌లో కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోన్ లోని సాక్షాలు హీరో దర్శన్ తో పాటు అతని గ్యాంగ్‌కు తీవ్ర ఇబ్బందులు తెచ్చి పెట్టే అవకాశం ఉందని తెలిసింది. బెంగళూరులోని పట్టనగెరెలో దొరికిన వినయ్ మొబైల్ ఫోన్ లోని ఆధారాలను పోలీసులు కోర్టుకు తెలిపారు.
అయితే ఈ ఆధారాలతో వినయ్‌ని ప్రశ్నించాల్సి ఉందని పోలీసు అధికారులు తెలిపారు.పట్టనగెరేలో వినయ్ మొబైల్ ఫోన్‌లో చాలా ముఖ్యమైన ఆధారం లభించాయని సమాచారం. దానిని పంపిన వ్యక్తిని వినయ్ సమక్షంలో విచారించాల్సి ఉంది. అందువల్ల వినయ్‌ను పోలీసు కస్టడీకి తీసుకోవాలని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను అంగీకరించిన కోర్టు వినయ్ ని పోలీసు కస్టడీకి పంపించింది.

రేణుకాస్వామి హత్య కేసులో మొత్తం 17 మంది అరెస్టు అయ్యారు. హీరో దర్శన్, ఆయన గర్ల్ ఫ్రెండ్, నటి పవిత్ర గౌడ తదితరులు ఈ హత్య కేసులో ఉన్నారు. ఇప్పటికే నటి పవిత్రా గౌడతో సహ 12 మందిని బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు పంపించారు. హీరో దర్శన్ తో పాటు మరో నలుగురు వ్యక్తులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇప్పుడు వినయ్ అనే వ్యక్తి మొబైల్ ఫోన్ లోని సాక్షం కూడా పోలీసులకు చిక్కడంతో కథ రసవత్తంగా మారింది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications