పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న పూజా హెగ్దె..?
ఒక్కప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అందరు ఠక్కున పూజా హెగ్డే పేరు చెప్పేవారు. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది. మహేష్ బాబుతో మహర్షి, ప్రభాస్‌తో రాధే శ్యామ్, ఎన్టీఆర్ సరసన అరవింద సమేత, అల్లు అర్జున్‌తో అల వైకుంఠపురం సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు ఇండస్ట్రీలో కొన్నాళ్లు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే... అనుహ్యంగా కనుమరుగైంది. వరుస ప్లాపులు రావడంతో బుట్టబొమ్మ రేసులో వెనుకపడిపోయింది.
రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ఇలా ఆమె నటించిన సినిమాలన్ని కూడా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టాయి. ఇదే సమయంలో శ్రీలీలకు తెలుగులో డిమాండ్ పెరగడంతో పూజా హెగ్డేను టాలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేసింది. పైగా గురుజీ సైతం గుంటూరు కారం సినిమా నుంచి తప్పించడంతో.. పూజా హెగ్డేకు తెలుగులో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది. ఇదిలా ఉంటే పూజా హెగ్దె తాజాగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుందట. ఆమె పెళ్లి కాకుండానే తల్లి కావాలని చూస్తుందట.

అయితే ఇది నిజ జీవితంలో కాదు. సినీ జీవితంలో. ఓ బాలీవుడ్ సినిమాలో ప్రెగ్నెంట్‌గా నటించడానికి పూజా హెగ్దె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం అందుతోంది. పూజా హెగ్డేకు బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారట . ఒక హీరోయిన్ కి తల్లి క్యారెక్టర్‌లో కనిపిస్తే హ్యూజ్ రెమ్యూనరేషన్ ఇస్తాను అంటూ ఆఫర్ చేశారట. అసలే అవకాశాలు లేక అల్లాడిపోతున్న పూజా ఈ సినిమాకు ఓకే చెప్పిందట. అయితే సినిమాలో చిన్నప్పటి క్యారెక్టర్‌లోనే ఆమె తల్లిగా కనిపించనుందని తెలుస్తోంది. ఇది తెలుసుకున్న అభిమానులు షాక్ అయిపోతున్నారు. ప్రస్తుతం పూజా హెగ్దె తల్లి పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్త నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications