ఎవరూ ఊహించని హీరోతో అక్కినేని కోడలు రొమాన్స్
తెలుగు అమ్మాయిలు హీరోయిన్‌గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకున్న ముద్దుగుమ్మ శోభితా ధూళిపాళ. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన శోభితా రాణా,కోల్గేట్, రిలయన్స్ ట్రెండ్స్, గోద్రెజ్ వంటి బ్రాండ్‌లకు మోడల్‌గా వ్యవహరించింది.ఇండియాస్ బెస్ట్ సినీస్టార్స్ కి ఖోజ్ అనే రియాల్టీ షోలో వైల్డ్ కార్డ్ పెర్ఫార్మర్‌గా కూడా పాల్గొంది. 2013లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది.
ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రామన్ రాఘవ్ 2.0 (సైకో రామన్)తో తన అరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటే ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ఇదే సమయంలో హీరో నాగ చైతన్యతో ప్రేమయాణం సాగించి మరింత వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా నాగ చైతన్య వల్లే శోభిత ధూళిపాళ లైఫ్ లైన్‌లోకి వచ్చింది.సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో మెయిన్‌టైన్ చేశాడు. ఈక్రమంలోనే డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరిగింది. అతి కొద్దిమంది సమక్షంలోనే వీరి వివాహం జరిగింది.

పెళ్లి తర్వాత తన సినిమాలతో బిజీ అయిపోయింది శోభిత.పెళ్లి అనంతరం అటు నాగ చైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోగా, ఇటు శోభిత సైతం సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటుంది. శోభిత తాజాగా తన కొత్త సినిమా ఆప్‌డేట్ ఇచ్చారు.
తమిళ దర్శకుడు పా. రంజిత్ 'వెట్టువమ్'అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. 'వెట్టువమ్' ఒక వినూత్నమైన ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ డ్రామా కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఆర్యతో పాటు వీఆర్ దినేశ్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్... అదిరిపోయే విజువల్స్, నెక్స్ట్ లెవెల్ టేకింగ్, మరియు అద్భుతమైన మ్యూజిక్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ టీజర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
తాజాగా, ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం అందాల నటి శోభిత ధూళిపాళను తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఆమె చాలా పవర్ ఫుల్ మరియు యాక్షన్ మోడ్‌లో కనిపించబోతున్నారట. త్వరలోనే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ, కమర్షియల్ హంగులకు దూరంగా ఉండే శోభిత ధూళిపాళ, తన పంథాకు తగ్గట్టుగానే వినూత్న కాన్సెప్ట్‌తో వస్తున్న 'వెట్టువమ్' ను ఎంచుకోవడం విశేషం. పెళ్లి తర్వాత ఆమె చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్, శోభితకు ఎలాంటి విజయాన్ని అందిస్తుంది, పా. రంజిత్ సృష్టించే ఈ కొత్త ప్రపంచంలో ఆమె పాత్ర ఎంత కీలకంగా మారుతుందనేది చూడాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
థియేటర్ల దగ్గర తొలిసారిగా 144 సెక్షన్, భారీగా పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు ఈ హీరో సినిమాకే -
"మొన్న చెప్పి హిట్టు కొట్టా.. మళ్లీ చెప్తున్నా బంపర్ బ్లాక్ బస్టర్" -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే! -
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
ఉస్తాద్‌కు ధురంధర్ డెంటు పెట్టేసాడుగా..! -
తెలంగాణ గద్దర్ అవార్డుల్లో చిన్న సినిమా హవా! -
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో












Click it and Unblock the Notifications