గుడ్ న్యూస్ : ప్రభాస్ , అనుష్క నోటి నుంచి ఒకేసారి పెళ్లి మాట
ప్రభాస్ పెళ్లి గురించి చాలా ఏళ్ల నుంచి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రతి ఏడాది తన పెళ్లిని వాయిదా వేసుకుంటూ వెళ్తున్నాడు డార్లింగ్ ప్రభాస్. హీరోయిన్ అనుష్కతో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని.. వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ అనేక వార్తలు తెర మీదకు వచ్చాయి. దీనికి తగ్గట్టు అనుష్క, ప్రభాస్ రిలేషన్ ఉన్నట్టు కనిపించింది. బాహుబలి తరువాత అనుష్క సినిమాలకు దూరం ఉంది.
ప్రభాస్‌తో పెళ్లి కోసమే అనుష్క సినిమాలు చేయడం లేదని పుకార్లు షికార్లు చేశాయి. అయితే తాము మంచి స్నేహితులమని అంతకు మించి ఏమీ లేదని వీరిద్దరు క్లారిటీ ఇవ్వడంతో ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. ఇక 'ఆదిపురుష్' సినిమా హీరోయిన్ కృతి సనన్‌తో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని గుసగుసలు వినిపించాయి. షూటింగ్‌లో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారిందనే వార్తలు బయటకు వచ్చాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ 'ఆదిపురుష్' తరువాత వీరిద్దరు క్లోజ్‌గా మూవ్ కావడంతో వీరు ప్రేమ నిజమే అని అనుకున్నారంతా.

కృతి సనన్‌తో ప్రేమ వ్యవహారం గురించి ప్రభాస్‌నే స్వయంగా ప్రశ్నించారు బాలకృష్ణ. తన అన్‌స్టాప్‌బుల్ షోకు గెస్ట్‌గా వచ్చిన ప్రభాస్‌ను కృతి సనన్‌తో ఎఫైర్ గురించి ప్రభాస్‌ను బాలకృష్ణ నేరుగానే ప్రశ్నించాడు. బాలకృష్ణ ప్రశ్నలకు ప్రభాస్ సమాధానం దాటవేసిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో చాలానే వైరల్ అయ్యాయి. అయితే కృతి సనన్ వేరే వ్యక్తితో రిలేషన్‌తో ఉండటంతో ప్రభాస్‌తో ఎఫైర్ కేవలం రూమర్ అని తేలిపోయింది. ప్రభాస్ పెళ్లి గురించి చాలా ఏళ్ల నుంచి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో అనుష్క, ప్రభాస్ గురించి మరోసారి చర్చ సాగుతోంది, ప్రభాస్ ఇటీవలే మంచు విష్ణు నటించిన 'కన్నప్ప' సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించారు.ఈ సినిమాలో ఓ సన్నివేశంలో పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ప్రభాస్‌ను ప్రశ్నిస్తారు.అది ఇప్పుడు అవసరమా అంటూ ప్రభాస్ కౌంటర్ ఇవ్వడం కనిపించింది. అలాగే అనుష్క తాజాగా నటించిన 'ఘాటీ' సినిమాలో కూడా పెళ్లి ప్రస్తావన వచ్చింది. పెళ్లి కోసం వెయిటింగ్ అని అనుష్క చెప్పడం కనిపించింది. అనుష్క, ప్రభాస్ ఇద్దరూ కూడా తమ సినిమాల్లో పెళ్లి ప్రస్తావన తీసుకురావడం అభిమానులకు ఆనందాన్ని ఇచ్చింది.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications