ప్రభాస్‌కు యాక్టింగే రాదు..'సలార్' అట్టర్ ఫ్లాప్..కలెక్షన్లు ఫేక్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం సలార్. బాహుబలి తరువాత సరైన విజయాలు లేక సతమతం అవుతున్న ప్రభాస్‌కు సలార్ మంచి విజాయాన్ని అందించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గత శుక్రవారం విడుదలైన సలార్ మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ స్టామినాను మరోసారి నిరూపించింది ఈ సినిమా.

తొలి రెండు రోజుల్లో 178 కోట్లు వసూలు చేసి సలార్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. దీంతో దేశం మొత్తం కూడా సలార్ ఫీవర్‌తో ఊగిపోతుంది. బాలీవుడ్‌లో కూడా సలార్ సత్తా చాటుతుంది. షారుఖ్ ఖాన్ నటించిన డంకీ ప్రభావాన్ని తట్టుకుని మరి స్టడీగా కలెక్షన్లు రాబట్టడం విశేషం. ప్రభాస్‌ను సూపర్ మాస్‌గా చూపించడంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ విజయవంతం అయ్యారనే చెప్పాలి.

 Prabhas doesnt know how to act..Salar utter flop..Collections are fake

ఇదిలా ఉంటే సలార్‌పై ఓ వ్యక్తి చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి.సలార్ సినిమాపై ఓ వ్యక్తి ఇచ్చిన రివ్యూపై ప్రభాస్ అభిమానులకే కాక.. సామన్య ప్రేక్షకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సలార్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. సినిమాను చూసి ప్రభాస్ అభిమానులే మధ్యలో నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ప్రభాస్‌‌కు యాక్టింగ్ రాదు.. 75% డూపును పెట్టి సినిమాను లాగించేశారు.

ప్రభాస్ ఎన్ని సినిమాలు చేసిన వేస్ట్ అవి సక్సెస్ కావు. దర్శకులు ప్రభాస్ కటౌట్‌ను వాడుకుంటున్నారు. వందల కోట్లు కలెక్షన్లు వచ్చాయని చెబుతున్నారు. అదింతా కూడా ఫేక్ అంటూ ఓ వ్యక్తి తన ఇష్టం వచ్చినట్టు ప్రభాస్ గురించి .. సలార్ గురించి మాట్లాడాడు. సదరు వ్యక్తిపై డార్లింగ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దమ్ముంటే నీ అడ్రస్ పెట్టు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+