'సలార్' ఫస్ట్ రివ్యూ..ప్రభాస్ విశ్వరూపం

దేశం మొత్తం సలార్ సినిమా ఫీవర్‌తో ఊగిపోతుంది. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌ అద్భుతంగా ఉండటంతో సలార్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.దీంతో రికార్డు స్థాయిలో సలార్‌కు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. సలార్ రెండు పార్టులుగా తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసిందే.

ట్రైలర్‌లోనే కథతో పాటు,పాత్రల తీరు తెన్నులను దర్శకుడు ప్రశాంత్ నీల్ పరిచియం చేశాడు. ఇదిలా ఉంటే సలార్‌కు సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. కథ మొత్తం కూడా ఖాన్సార్ సామ్రాజ్యం చూట్టునే తిరుగుతుంది. దేవా, రాజమన్నార్ అనే ఇద్దరు చిననాటి మిత్రులు స్నేహం కోసం ఎలా ముందుకు వెళ్తారనేది సలార్ మొదటి పార్ట్ కథ.

Prabhas salaar first review: high voltage power pack

కేజీఎఫ్ మాదిరగానే ఖాన్సార్‌కు అధిపతి కావాలని పలువురు ప్రయత్నిస్తుంటారు. ఖాన్సార్‌‌కు రాజు కావాలని రాజమన్నార్(పృథ్విరాజ్) ప్రయత్నించి ఓడిపోవడం..దాని కోసం చిననాటి స్నేహితుడైనా దేవా(ప్రభాస్) సాయం కోరటంతో అసలు కథ మొదలవుతుంది. రాజమన్నార్(పృథ్విరాజ్) ఓడిపోయే సన్నివేశంతో పాటు , దేవా( ప్రభాస్ ) ఖాన్సార్‌లో ఎంట్రీ ఇచ్చే సీన్లను తెర మీద దర్శకుడు చాలా బలంగా చూపించారు.

Prabhas salaar first review: high voltage power pack

ఇక దేవా(ప్రభాస్) ఖాన్సార్‌‌లో అడుగుపెట్టిన దగ్గర నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. తన స్నేహితుడి శత్రువులందరిని అడ్డు తొలగించడంతో ఖాన్సార్‌ రాజమన్నార్ (పృథ్విరాజ్) వశం అవుతుంది. అయితే ఖాన్సార్ సామ్రాజ్యం కోసం స్నేహితుడు(పృథ్విరాజ్ ) తనని వాడుకుని మోసం చేశాడనే తెలియడంతో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది.

Prabhas salaar first review: high voltage power pack

మోసం చేసిన చిననాటి స్నేహితుడుకి దేవా (ప్రభాస్) ఏవిధంగా బుద్ది చెప్పాడనేది మిగిలిన కథ. ఖాన్సార్‌ను దేవా (ప్రభాస్) ఎలా సొంతం చేసుకున్నాడు..తరువాత జరిగే పరిణామాలను సలార్ రెండో భాగంలో చూపిస్తారు. ప్రాణ స్నేహితులుగా ఉన్న ఇద్దరు మిత్రులు ఎలా శత్రువులుగా మారుతారనేది మిగిలిన కథ. ఈ సమయంలో వచ్చే సెంటిమెంట్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. కేజీఎఫ్ మాదిరిగానే తల్లి సెంటిమెంట్‌ను సలార్‌లో కూడా చూపించాడు దర్శకుడు.

ఇదే సమయంలో హీరోయిన్ శృతి హాసన్‌ది కూడా కథలో కీలక పాత్రే. కథను మలుపు తిప్పే పాత్రలో శృతి హాసన్‌ కనిపిస్తారు. ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్‌ల మధ్య స్నేహం, శత్రుత్వానికి దారి తీసిన పరిస్థితులు మొదటి భాగంలో ప్రధానంగా హైలైట్‌గా నిలిచాయి. ఊహించని ట్విస్ట్‌తో సలార్ మొదటి పార్ట్‌ ముగుస్తుంది. రెండో భాగంలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠను మెయిన్‌టైన్ చేయడంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ విజయవంతం అయ్యాడనే చెప్పాలి.

Prabhas salaar first review: high voltage power pack

బహుబలి తరువాత డార్లింగ్ అభిమానులు ఏమైతే ప్రభాస్ నుంచి కోరుకుంటున్నారో వాటిని దర్శకుడు అద్భుతంగా చూపించాడు.ప్రభాస్ ఎంట్రీ సీన్‌తో పాటు, ఖాన్సార్‌లో ప్రభాస్ అడుగు పెట్టే సీన్లకు గూస్ బంప్స్ రావడం ఖాయం. ఒక్క ముక్కలో చెప్పాలంటే సలార్‌లో ప్రభాస్ తన విశ్వరూపమే చూపించాడు.మొత్తానికి బహుబలి తరువాత డార్లింగ్ ప్రభాస్‌కు ఆ రేంజ్ హిట్ దొరికినట్టే కనిపిస్తుంది. సినిమాకు హిట్ టాక్ వస్తే 2000 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సలార్‌తో బాక్సాఫీస్‌కు అమ్మ మొగుడులా ప్రభాస్ మరోసారి నిలవడం ఖాయంగా కనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+