పబ్లిక్‌గా హీరోయిన్‌ను నలిపేశారయ్యా..! (వీడియో)

సెలబ్రిటీలు పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు బయటకు వచ్చినప్పుడు ఫ్యాన్స్ చేసే హడావిడి అంతా ఇంత కాదు. ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా వారిని దాటుకుని వచ్చి మరి తమ అభిమాన నటీ, నటులను కలవడానికి అభిమానులు ప్రయత్నిస్తుంటారు. స్టార్స్ ఎలాంటి పరిస్థుతుల్లో ఉన్నా వారితో ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే దీనిని కొందరు ఆకతాయిలు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. కొందరు హీరోయిన్స్‌తో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు మనం చాలానే చూశాం.

తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రేమలు సినిమాతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది మమితా బైజూ. మళయాళ డబ్బింగ్ వర్షన్‌గా తెలుగులో విడుదలైన ప్రేమలు సినిమా మంచి విజయాన్ని నయోదు చేసుకుంది. ఈ సినిమాతో మమితా బైజూ తెలుగులో సైతం మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్‌లో మమితా బైజూకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. తాజాగా ఈ భామ చెన్నైలోని షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఈ సమయంలో ఫ్యాన్స్‌ ధాటికి ఆమె ఇబ్బంది పడ్డారు.

Premalu Star Mamitha Baiju Looks Petrified As Fans Mob Her At Event

తనను చూసేందుకు భారీగా వచ్చిన అభిమానులను మధ్యలో ఆమె నలిగిపోయారు. అక్కడ తమ అభిమాన హీరోయిన్ ను చూసేందుకు సెల్ఫీ దిగేందుకు మమితాను చుట్టుముట్టినంత పని చేశారు. ఆమెకు ఊపిరి సలపనివ్వనంత పని చేశారు. దీంతో ఆమె చుట్టూ ఉన్న కొంతమంది బాడీగార్డ్స్‌ అండ్.. మాల్లో పని చేసే లేడీస్‌.. ఆమెను ప్రొటెక్ట్ చేస్తూ.. అక్కడి నుంచి బయటపడేందుకు సాయం చేశారు. ఈ ఘటనతో మమితా బైజూకు ఈ రేంజ్‌లో ఫ్యాన్స్ ఉన్నారనే విషయం అందరికి అర్థం అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+