త్రిష వల్ల నా జీవితం సర్వ నాశనం అయింది..!

హీరోయిన్ త్రిష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 20 ఏళ్లుగా హీరోయిన్‌గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో త్రిష నటించింది. ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి టాప్ హీరోల సరసన నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. యంగ్ హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో త్రిష హవా తగ్గిపోయింది.

అయితే త్రిష ఇటీవలే మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. పొన్నియర్ సెల్వం రెండు పార్ట్‌ల్లో అలరించిన త్రిష, తమిళ స్టార్ హీరో విజయ్ , లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం చిరంజీవి సరసన విశ్వంభర సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.త్రిష ఇదిలా ఉంటే తాజాగా త్రిషపై నిర్మాత సంచలన ఆరోపణలు చేశారు. తమిళ నిర్మాత గిరిధర్ త్రిషపై షాకింగ్ కామెంట్స్ చేశారు. నీతో లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేయాలనుకుంటున్నట్లు చెబితే ..దానికి త్రిషకి ఒకే చెప్పిందని.. చాలా కథలు పంపించాం కానీ ఆమెకి నచ్చడం లేదు.

Producer Giridhar made shocking comments on Trisha

డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి ఒక హర్రర్ కథతో వచ్చారు. ఆ కథ త్రిషకు నచ్చింది. దాంతో త్రిషకి ఒక రెమ్యునరేషన్ అనుకుని షూటింగ్‌కు వెళ్లాం. అయితే కొన్ని రోజులు షూటింగ్ అయిన తర్వాత చెప్పుడు మాటలు విని, తన రెమ్యునరేషన్ పెంచాలని ఒత్తిడి చేసిందని నిర్మాత గిరిధర్ చెప్పుకొచ్చారు. కోటి డిమాండ్ చేసిందని,అయితే ఇవ్వలేమని కావాలంటే తమిళ శాటిలైట్ హక్కులు ఇస్తామని చెప్పామని..ఎంత బతిమాలినా వినలేదు. అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వచ్చింది. సినిమా రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. దీంతో నా జీవితమే తలక్రిందులు అయింది. త్రిషతో సినిమా చేయాలి అని ఆలోచన వచ్చినప్పుడే నా జీవితం మారిపోయింది. దీనికి కారణం దర్శకుడు, త్రిష అంటూ నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక త్రిష వ్యక్తిగత జీవితానికి వస్తే..ఆమె ఓ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. నిశ్చితార్థం వరకు వెళ్లిన వీరి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. అప్పటి నుంచి త్రిష సింగిల్‌గానే ఉంటోంది. అయితే ఇటీవల త్రిష, ఇళయ దళపతి విజయ్‌లకు సంబంధించి ఓ రూమర్ తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. విజయ్ , త్రిష రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. అయితే ఈ రూమర్లపై ఇద్దరు కూడా స్పందించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+