సినీ పరిశ్రమలో మరో విషాదం - ప్రముఖ నటి కన్నుమూత..!!

సీనియర్‌ నటి సరోజాదేవి (87) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో సోమవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో సరోజాదేవి నటించారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎంజీఆర్‌ల వంటి దిగ్గజ నటులతో పలు సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించారు. 1942 లో కర్ణాటకలో జన్మించిన సరోజాదేవి 13 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 200కు పైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.

తెలుగులో ఇంటికి దీపం ఇల్లాలు, మంచి చెడు, దాగుడు మూతలు వంటి హిట్‌ సినిమాల్లో నటించి అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రముఖ తెలుగు నటుడు కోటా శ్రీనివాసరావు మరణం నుంచి సినీ పరిశ్రమ కోలుకోక ముందే మరో ప్రముఖ నటిని కోల్పోయింది. సరోజా దేవీ మరణం పై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కోటా శ్రీనివాసరావుపై దాడి చేయడానికి కారణం ఆ సినిమానే..?

Prominent Actress B Saroja Devi passes away at 87 in Bengaluru

సరోజా దేవీ 1938 జనవరి 7వ తేదీన బెంగళూరులో జన్మించారు. 13 ఏళ్లకే ఆమెకు సినిమా ఆఫర్ వచ్చింది. అయితే, ఆ ఆఫర్‌ను ఆమె కాదన్నారు. కొన్నేళ్ల తర్వాత 1955లో విడుదలైన 'మహాకవి కాళిదాసు' సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోటే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. రెండేళ్ల తర్వాత '1957'లో 'పాండురంగ మహాత్యం' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలో హీరోయిన్‌గా చేశారు.

Prominent Actress B Saroja Devi passes away at 87 in Bengaluru

1985లో ఆమె లేడీస్ హాస్టల్ అనే సినిమా కోసం షూటింగ్ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే ఆమె భర్త అనారోగ్యానికి గురయ్యారు. మరుసటి సంవత్సరం 1986లో ఆయన చనిపోయారు. భర్త మరణం తర్వాత ఆమె సినిమా షూటింగ్‌లో పాల్గొనలేదు. ఓ సంవత్సరం పాటు కుటుంబసభ్యుల్ని తప్ప వేరే వాళ్లను కలవను కూడా లేదు. అయితే, నిర్మాతలు, ఫ్యాన్స్ బలవంతం చేయటంతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. 2019లో 'నటసార్వభౌమ' అనే కన్నడ సినిమాలో చివరగా నటించారు. దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన వారు.. ఇతర ప్రముఖులు సరోజా దేవి మరణం పైన సంతాపం ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+