గేమ్‌ఛేంజర్‌కు అవకాశమే ఇవ్వను: అది తెచ్చిన అల్లు అర్జున్
మెగా కుటుంబానికి, అల్లు కుటుంబానికి యుద్ధం ముదిరిపోయిందని చెప్పొచ్చు. కొన్నాళ్ల నుంచి ఉప్పు నిప్పులా ఉన్న మెగా కుటుంబం, అల్లు అర్జున్ కుటుంబం ఏపీ ఎన్నికల సమయానికి విభేదాలను తీవ్రస్థాయికి చేర్చుకున్నాయి. ఆ ఎన్నికల్లో నంద్యాల నుంచి వైసీపీ తరఫున పోటీచేస్తున్న తన స్నేహితుడు రవిచంద్రకిషోర్ రెడ్డికి మద్దతుగా బన్నీ నంద్యాల వెళ్లాడు. అక్కడ చిన్నపాటి ర్యాలీ జరగడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా నాలుగు రోజుల క్రితమే హైకోర్టులో బన్నీ క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంతో ఆ కేసును హైకోర్టు కొట్టేసింది. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కూడా అల్లు అర్జున్ కు ఆహ్వానం అందలేదు.
తీవ్రమవుతున్న విభేదాలు
ఇలా... ఈ రెండు కుటుంబాల మధ్య వివాదాలు, విభేదాలు తీవ్రమవుతూ వస్తున్నాయి. డిసెంబరు 5వ తేదీన పుష్ప2 విడుదలవుతుండగా, వచ్చే ఏడాది సంక్రాంతికి గేమ్ ఛేంజర్ రాబోతోంది. పుష్ప2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్లలో విడుదలవుతోంది. గేమ్ ఛేంజర్ దర్శకుడు శంకర్ అయినప్పటికీ అతని గత చిత్రం భారతీయుడు2 ఇండియాలోనే అత్యంత డిజాస్టర్ సినిమాగా నిలవడంతో మెగా అభిమానులు సినిమా ఎలా వస్తుందో అన్న విషయమై భయపడుతున్నాయి. దీనికి దిల్ రాజు నిర్మాత కాగా, పుష్ప2కు మైత్రీ మూవీస్ నిర్మాతలు. వీరిద్దరికి కూడా అస్సలు పడదు. సినిమాల పరంగా, డిస్ట్రిబ్యూషన్ పరంగా, థియేటర్ల పరంగా వీరిమధ్య హోరాహోరీ యుద్ధం నడుస్తోంది.

నానా హైరానా పాట.. పీలింగ్ పాట ప్రోమో
నిన్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలోని నానా హైరానా అనే పాటకు సంబంధించి లిరికల్ సాంగ్ విడుదలైంది. 21 గంటల వ్యవధిలో ఇది 18 మిలియన్ వ్యూస్ సంపాదించుకొని భారీ రికార్డు దిశగా కొనసాగుతోంది. సరేగమ తెలుగువారు విడుదల చేశారు. సరిగ్గా ఈరోజే పుష్ప2 చిత్రం నుంచి పీలింగ్ అనే పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా రెండు గంటల్లో 5 లక్షలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. మెగా అభిమానుల మధ్య, అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో యుద్ధం నడుస్తోంది. ప్రోమోతోనే తాము అత్యధిక వ్యూస్ దక్కించుకుంటామని బన్నీ అభిమానులు సవాల్ చేస్తుండగా, అది మీవల్ల కాదంటూ మెగా అభిమానులు తిరిగి సవాల్ చేస్తున్నారు. వీరిద్దరి అభిమానుల యుద్ధంతో రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎటువంటి మలుపులు తిరుగుతాయో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications