అమ్మాయిలకు కండోమ్ ఎలా వాడాలో చెబుతున్న స్టార్ హీరోయిన్ (వీడియో)
అమ్మాయిలు కండోమ్ ఎలా వాడాలో చెబుతోంది ఓ స్టార్ హీరోయిన్. దీనిపై ఓ వీడియోపై ప్రజెంటేషన్ కూడా ఇచ్చింది అమ్మడు. దీనిపై నెటిజన్లు ఒకింత ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయి అయి ఉండి ఇలా కండోమ్ గురించి చెప్పడం ఏంటని ఆ హీరోయిన్‌పై మండిపడుతున్నారు. ఇంతకీ ఇలా కండోమ్ గురించి చెప్పింది మరెవ్వరో కాదు హీరోయిన్ రాధిక ఆప్టే. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..బాలీవుడ్‌లో రాధిక ఆప్టేకు మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా బోల్డ్ హీరోయిన్‌గా రాధిక ఆప్టేకు పేరుంది.
సినిమాల్లో బోల్డ్‌గా నటించడే కాకుండా.. ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో కూడా రాధిక ఆప్టే బోల్డ్. బాలీవుడ్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన రాధిక ఆప్టే ఆ తర్వాత తెలుగు , తమిళ సినిమాల్లో నటించి ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. రాధిక తెలుగులో బాలయ్య సరసన 'లెజెండ్' అనే సినిమాలో నటించి మెప్పించింది. కానీ తెలుగులో పెద్దగా ఆఫర్లు రాక బాలీవుడ్‌కు చెక్కేసింది. ఇక సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లో న్యూడ్‌గా నటించి సంచలనం సృష్టించింది. తాజాగా ఈ భామ అమ్మాయిలు ఎలాంటి కండోమ్ వాడాలో టిప్స్ అందిస్తూ ఓ వీడియో విడుదల చేసింది.

అయితే ఇది ఓ కండోమ్ కంపెనీకి సంబంధించిన యాడ్‌గా తెలుస్తోంది. ఈ యాడ్‌లో రాధిక ఆప్టే మాట్లాడుతూ...కండోమ్స్ సమాజంలో ఈ పేరు పలకడం నిషేధం.. ఎందుకు? కండోమ్స్ ఎప్పుడు మన పార్ట్‌నర్స్ ఛాయిస్‌కు వదిలేస్తున్నాం ఎందుకు? ఈ నిర్ణయంలో మన మాటకు పట్టింపు ఉండదా? మన సుఖం వదిలి బాధను భరిస్తూ కండోమ్స్‌ను ఎందుకు భరించాలి. కండోమ్స్ విషయంలో మన సొంత నిర్ణయం ఎందుకు ఉండకూడదు. ఏ కండోమ్స్ మనకు ఆనందాన్ని, కంఫర్ట్‌ను ఇస్తుందో అదే ఎపిక్ కండోమ్స్‌ను వాడండి. ఎవరో ఏదో అనుకుంటారని చింతించకండి అమ్మాయిలు మీ కండోమ్ మీరే కొనుక్కోండి అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రాధిక ఆప్టే చేసిన కండోమ్ యాడ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications