రామ్ చరణ్ బర్త్‌డే: ఫ్యాన్స్‌కు మెగా ఫ్యామిలీ మూడు మరిచిపోలేని బహుమతులు; పండుగే పండుగ!!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు ఈరోజు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాలలోనూ దేశాలలోనూ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా కొత్త సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తనకంటూ ఒక క్రేజ్ ను సాధించుకొని, బాక్సాఫీస్ బద్దలు కొట్టే సినిమాలను ప్రేక్షకులకు అందించారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రాంచరణ్ పుట్టినరోజు కానుకగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'గేమ్ ఛేంజర్' శంకర్ సినిమా జరగండి జరగండి అనేపాటను మూవీ మేకర్స్ విడుదల చేశారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. ఎస్ తమన్ సంగీత సారథ్యం అందిస్తున్న ఈ పాటను బర్త్ డే కానుకగా ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేశారు.

ఇది రామ్ చరణ్ అభిమానులకు గొప్ప విజువల్ ఫీస్ట్ కాగా, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తల్లి చిరంజీవి సతీమణి సురేఖ ఒక మరిచిపోలేని బహుమతిని ఇచ్చారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సురేఖ ఇటీవల తాను స్టార్ట్ చేసిన అత్తమ్మాస్ కిచెన్ సంస్థ తరఫున 500 మందికి అన్నదానం చేశారు.
ఆమె స్వయంగా వంటలు వండి ఆలయంలోని భక్తులకు అన్నదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో చిన్న జీయర్ స్వామి కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది కూడా ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ గా మారింది. అంతేకాదు ఈరోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు రాంచరణ్ ఉపాసన దంపతులు.
ఎన్నో సంవత్సరాల నిరీక్షణ ఫలితంగా పుట్టిన క్లీంకారను తీసుకొని తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్ చరణ్ దంపతులు అక్కడ ఫ్యాన్స్ సంతోషానికి కారణమయ్యారు. ఇక ఇదే సమయంలో ఆలయంలో స్వామివారిని దర్శించుకునే క్రమంలో క్లీంకార ఫేస్ రివీల్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అభిమాన హీరో కుమార్తె క్యూట్ ఫోటోను చూస్తూ అభిమానులు మై మరిచిపోతున్నారు. ఇక ఈ మూడు సంఘటనలు నేడు రామ్ చరణ్ అభిమానులకు కన్నుల పండుగగా మారాయి.












Click it and Unblock the Notifications