తన కొత్త ఫ్రెండ్‌ను పరిచయం చేస్తోన్న రామ్‌చరణ్.. ఎవరో తెలుసా..
చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి గొప్ప నటుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో గ్లోబల్ స్టార్‌గా మారాడు. ఈ మెగా పవర్‌స్టార్ సోషల్‌మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గానే కనిపిస్తుంటారు. చిరుత సినిమాతో తెలుగ చిత్రసీమకు పరిచయమైన రామ్‌చరణ్ ఆ తర్వాత ఎన్నో గొప్ప సినిమాలు తీసారు. రంగస్థలం వంటి సినిమాలతో తనలో ఉన్న మరోకోణాన్ని అభిమానులకు పరిచయం చేశాడు. ఎప్పడూ ప్రేక్షకులను ఇంట్రెస్టింగ్ పోస్టులతోనూ ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే, తాజాగా, సోషల్‌మీడియాలో తన లేటేస్ట్ పోస్ట్ వైరల్‌గా మారింది. మై న్యూ ఫ్రెండ్ అంటూ తన కొత్త ఫ్రెండ్‌ను పరిచయం చేస్తున్నారు రామ్‌చరణ్. ఈ పోస్ట్ కాస్త ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ కొత్త ఫ్రెండ్ ఎవరో తెలుసా...? రామ్‌చరణ్ కొత్తగా పెట్టిన పోస్ట్‌లో తన కొత్త ఫ్రెండ్ అంటూ న్యూ హార్స్‌ను అభిమానులకు పరిచయం చేశారు. హార్స్‌తో దిగిన ఫోటోలను కూడా చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
రామ్‌చరణ్ కొత్త హార్స్..పేరేంటి..
రామ్‌చరణ్‌కు హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే అందులో చిన్నప్పటినుంచే శిక్షణ తీసుకున్నారు. అప్పటి నుంచే ఆయన గుర్రాలను కూడా పెంచుతున్నారు. మగధీర సినిమాలో కూడా చరణ్ హార్స్‌రైడింగ్ చేయడం మనం చూస్తాం. ఆ సినిమాలో ఉన్న గుర్రం కూడా చరణ్‌దేనట...దాని పేరు కాజల్ అని కూడా చాలా సందర్భాల్లో చరణ్ ప్రస్తావించారు. ఇప్పుడు తాజాగా పెట్టిన పోస్ట్‌లో బ్లాక్ కలర్‌లో ఉన్న గుర్రం తన కొత్త ఫ్రెండ్ అంటూ అభిమానులకు పరిచయం చేశారు. రామ్‌చరణ్ దానికి ఒక పేరును కూడా పెట్టారు. ఆ గుర్రాన్ని ముద్దుగా Blaze అని పిలుచుకుంటారట.. రామ్ చరణ్ కు పోలో అండ్ హార్స్ రైడింగ్ క్లబ్ కూడా ఉందట..

స్టైలిష్ లుక్‌లో రామ్‌చరణ్..
ఇక ఈ ఫోటోలోని చరణ్ లుక్స్ చూసి అభిమానులు ఫిదా అయిపోయితున్నారు. చరణ్ బ్లాక్ టీషర్ట్, సన్ గ్లాసెస్ ధరించి స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. 'ఆర్ఆర్ఆర్' తర్వాత చరణ్ నటిస్తున్న చిత్రం Game Changer. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇంతకుముందే ఈ నటితో ఓ సినిమాను నటించారు చరణ్. ఈ సినిమాకి తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అలాగే బుచ్చిబాబు సానాతోనూ RC16ను త్వరలో స్టార్ట్ చేయనున్నారు. ఇప్పటికే అధికారికంగా ఈ సినిమా గురించి అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
అయ్యప్ప మాలలో రామ్‌చరణ్..
ప్రతి సంవత్సరం రామ్‌చరణ్ అయ్యప్ప దీక్ష తీసుకుంటారు. ఆ సమయంలో ఆయన ఎంతో నిష్టగా అయ్యప్పను కొలుస్తారు. చాలాసందర్భాల్లో అయ్యప్ప మాలలో కనిపించడం చూసే ఉంటాం. మాలలోనే సినిమా ప్రమోషన్లో పాల్గొనడం ఇంతకుముందు చూశాం. ప్రస్తుతం రామ్ చరణ్ ముంబైలో ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా ముంబైలోని ఎయిర్ పోర్టులో మాలలో కనిపించారు. ఓ యాడ్ షూట్ కోసం అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications