డిజాస్టర్ కా బాప్ దర్శకుడితో రామ్ చరణ్ కొత్త సినిమా..? ఇంత నమ్మకం ఏంటి అన్నా..?

సినిమా ఇండస్ట్రీ అన్నాక హిట్స్, ప్లాఫ్ లు కామన్.. ఒక్కసారి ఒక్కో విధంగా ప్రేక్షకులు సినిమాల రిజల్ట్ ను నిర్ణయిస్తుంటారు. హిట్ అవుతుందనుకున్న సినిమా ప్లాఫ్ అవుతుంటాయి. అలాగే సైలెంట్ గా ఎలాంటి హడావుడి లేకుండా రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతుంటాయి. ఏ సినిమా హిట్ అవుతుందో.. ఏ సినిమా ఫట్ అవుతుందో ఈ రోజుల్లో చెప్పడం కష్టంగా మారింది. ఇక ఇండస్ట్రీలో ప్లాఫ్ ఫేజ్ లో ఉన్నవారిని ఎవరూ పట్టించుకోరనేది తెలిసిన విషయమే.. సక్సెస్ వెనకాలే ఇండస్ట్రీ పరుగెడుతుంది. వరుసగా హిట్స్ కొట్టే దర్శకులతోనే స్టార్ హీరోలు సినిమాలు చేయాలని కోరుకుంటారు. అటు దర్శకులు కూడా స్టార్ హీరోలనే ఎంచుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా ఛాన్స్ వస్తే ఏ దర్శకుడూ వదులుకోడు. అలా తీసింది ఒక్క సినిమానే అయినా కథను నమ్మి బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రావత్ కు ఛాన్స్ ఇచ్చారు ప్రభాస్.

అలా రూపుదిద్దుకున్న ఆది పురుష్ సినిమా బాక్సాఫీస్ వద్ద బెడిసికొట్టింది. డిజాస్టర్ టాక్ తో విమర్శలు సైతం ఎదుర్కొంది. శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ నటన అద్భుతంగా ఉంది. కానీ దర్శకత్వం అట్టర్ ప్లాఫ్ అయింది. దాంతో మూవీ ఆశించినంత విజయాన్ని అందుకోలేక పోయింది. ఇక ఆదిపురుష్ సినిమా తర్వాత దర్శకుడు ఓమ్ రావత్ దాదాపు కనిపించుకుండా పోయాడు. అయితే ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటి అంటే ఓమ్ రావత్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ న్యూస్ తెలియగానే మెగా ఫ్యాన్స్ తలపట్టుకుంటున్నారు.

RamCharan movie with director Om Raut A new movie for Ram Charan with Adipurush director Om Raut

ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమాను ఓకే చేసి రామ్ చరణ్ పెద్ద తప్పు చేశారని మెగా ఫ్యాన్స్ బాధపడుతుంటే ఇప్పుడు మరో డిజాస్టర్ దర్శకుడితో చెర్రీ సినిమా చేయడంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పెద్ది సినిమాతో రామ్ చరణ్ కెరీర్ గాడినపడిందని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్న నేపథ్యంలో ఈ వార్త వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఓ వైపు సుకుమార్ బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్ తో రెడీగా ఉంటే మధ్యలో ఓమ్ రావత్ ఎందుకొచ్చాడంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది మున్ముందు తెలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+