Ramgopal Varma: రాంగోపాల్ వర్మకు 3 నెలల జైలుశిక్ష-నాన్ బెయిలబుల్ వారెంట్..!
టాలీవుడ్ నిర్మాత, దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న ఆయనకు ఇవాళ షాక్ ఎదురైంది. ముంబైలోని స్థానిక కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడమే కాకుండా మూడు నెలల జైలుశిక్ష సైతం విధిస్తూ కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో హైదరాబాద్ లో ఉండే వర్మ ఇప్పుడు ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది.

2018లో శ్రీ అనే సినీ నిర్మాణ సంస్థకు వర్మ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో ఆయనపై సంస్థ ప్రతినిధి మహేష్ చంద్ర మిశ్రా కేసు పెట్టారు. దీనిపై ముంబైలోని అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టు ఆయనకు 2022లో 5 వేల పూచీ కత్తుతో బెయిల్ కూడా ఇచ్చింది. కానీ ఆ తర్వాత కోర్టు విచారణకు హాజరుకాకుండా ఉండిపోయిన వర్మకు పలుసార్లు సమన్లు పంపినా స్పందించలేదు. దీంతో కోర్టు ఇవాళ ఈ చెక్ బౌన్స్ కేసులో వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడమే కాకుండా మూడు నెలల జైలుశిక్ష కూడా విధిస్తూ తీర్పు ఇచ్చింది. అలాగే పిటిషనర్ కు వర్మ రూ.3.72 లక్షలు పరిహారం కూడా చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
చెక్ బౌన్స్ వ్యవహారంలో నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 138 కింద రాంగోపాల్ వర్మను దోషిగా ముంబైలోని అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టు నిర్ధారించింది. మరోవైపు వర్మ ఆర్ధికంగా చితికిపోయాడని, ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఆయన ఆర్ధిక పరిస్ధితి అంతంత మాత్రంగా ఉందని తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ లోని తన ఆఫీసును సైతం అమ్ముకున్నారు. తాజాగా తన ఆర్ధిక పరిస్ధితితో పాటు తాను ఎంచుకున్న సినిమాలపై వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను తీసిన గొప్ప సినిమాలను చూసిన ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications