రాశీ ఖన్నా వీడియో వైరల్.. మరీ ఇంత క్యూట్‌గా తిట్టును వాడతారా !!

అందాల భామ "రాశీ ఖన్నా" గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత "జై లవ కుశ", "వెంకీ మామ", "ప్రతి రోజు పండగే" వంటి చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చివరిగా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌, థాంక్యూ సినిమాల త‌ర్వాత ఆమె తెలుగులో మ‌రో సినిమా చేయ‌లేదు.

ఇక మూడేళ్ల సుదీర్ఘ విరామం త‌ర్వాత మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది ఈ భామ. ప్రస్తుతం రాశీ ఖ‌న్నా నటిస్తున్న చిత్రం "తెలుసు క‌దా". స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకురాలు నీరజ కోనా తెరకెక్కిస్తున్నారు. కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి కూడా మరో హీరోయిన్ గా చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ చిత్రంపై ఆడియన్స్ లో భారీగానే అంచనాలు ఉన్నాయి.

rashi-khanna-latest-video-goes-viral-about-her-comments-in-podcast

కాగా మూవీ రిలీజ్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది తెలుసు కదా మూవీ యూనిట్. ఈ మేరకు రాశీ ఖన్నా ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఏమీ జరగకుండా నవ్వడానికి నేనేమైనా పిచ్చి ము**నా ? అంటూ ఓపెన్ అయిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తిట్టు కూడా అంత క్యూట్ గా అనొచ్చా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

రాశీ ఖన్నా ఏం చెప్పిందంటే..

రీసెంట్ గా ప్రముఖ రియాలిటీ షో కి రాశీ ఖన్నా, సిద్దు జొన్నలగడ్డ.. నీరజకోన, కృతి ప్రసాద్, వైవా హర్ష హాజరయ్యారు. అయితే ఆ షోలో ఎక్కువగా నవ్వుతూ కనిపించింది. అందుకు సిద్దు కూడా మీ పీఆర్ ఏం చేసినా కూడా నవ్వుతూ ఉండు అని చెప్పాడా అన్నారు. ఇదే విషయంపై పాడ్ కాస్ట్ లో రియాక్ట్ అవుతూ.. తనకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం అవుతుందని.. ఏమీ జరగకుండా నవ్వడానికి నేనేమైనా పిచ్చి ము** నా? అంటూ ఓపెన్ అయిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తనకు తెలుగు బాగా మాట్లాడడానికి రాకపోయినా.. అర్ధం చేసుకోగలను అని చెప్పే సందర్భంలో అలా అని ఉండవచ్చని భావిస్తున్నారు.

మేవవైపు ఈ బ్యూటీ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీలో నటిస్తుంది. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల రాశీ ఖన్నా పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయినట్లు ప్రకటించారు. ఈ సినిమా ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+