నెటిజన్‌కు రష్మిక అదిరిపోయే రిప్లై
తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది రష్మిక మందన్నా. ఈ మధ్య శ్రీలీల కాస్తా హడావిడి చేసినప్పటికీ...ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలీలపై ఫ్లాప్ హీరోయిన్ ముద్ర పడింది. ఇక పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్దెకు తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం రష్మిక మందన్నానే టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు.
రష్మిక మందన్నా నటించిన సినిమాలు బాక్సాఫీస్ సూపర్ హిట్ కావడంతో ఆమె నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. గతేడాది పుప్ప, సీతరామం, యానిమల్ వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక రష్మిక మందన్నా రాబోవు సినిమాల లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది. తెలుగులో అల్లు అర్జున్ పుష్ప-2తో పాటు నితిన్‌తో మరో సినిమా చేస్తోన్న హాట్ బ్యూటీ బాలీవుడ్‌లో షాహిద్ కపూర్, విక్కి కౌషల్‌తో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది.

సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గానే ఉంటోంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ అభిమానికి రిప్లై ఇచ్చి వార్తల్లో నిలిచింది ఈ అమ్మడు. యానిమల్ సినిమాలో ఓ వీడియోను షేర్ చేస్తూ.. "గుర్తుంచుకోండి. మనిషిని నమ్మడం కంటే భయంకరమైనది ఏదీ లేదు" అంటూ యూజర్ క్యాప్షన్ ఇచ్చారు.ఈ వీడియోపై రష్మిక స్పందించింది. "కరెక్షన్.. స్టుపిడ్ ను నమ్మితే భయంకరం. చాలా మంది మంచి పురుషులు కూడా ఉన్నారు. వారిని నమ్మడం కూడా ప్రత్యేకమే" అంటూ లవ్ ఎమోజీని షేర్ చేసింది. ప్రస్తుతం రష్మిక కామెంట్ నెట్టింట వైరలవుతుంది.
Remember nothing is scarier than trusting a man..#RanbirKapoor #RashmikaMandanna
— Falena🦋 (@_ivsfa8) June 13, 2024
#TriptiDimri#Animal pic.twitter.com/DEAw6Dxhlf












Click it and Unblock the Notifications