పేరు మార్చుకున్న 'నేషనల్ క్రష్'.. 400 పేద కుటుంబాలకు 'అన్నపూర్ణ' పేరుతో భారీ సాయం!

సినిమా తెరపై నటనతో అలరించడమే కాదు.. నిజ జీవితంలోనూ తన మంచి మనసుతో ఎప్పుడూ ముందుంటుంది రష్మిక మందన్న. తాజాగా ఆమె తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం పేరు మార్చుకోవడమే కాదు, ఏకంగా 400 పేద కుటుంబాలకు ఏడాది పాటు అండగా నిలవాలని ఆమె నిర్ణయించుకుంది. సౌత్ ఇండియా వ్యాప్తంగా అత్యంత వెనుకబడిన, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 400 పేద కుటుంబాలను గుర్తించి.. వారికి 'అన్నపూర్ణ' పేరుతో నిత్యావసర సరుకులు అందించే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేవలం ఒక్కసారితో సరిపెట్టకుండా, రాబోయే ఏడాది పాటు ప్రతి మూడు నెలలకోసారి ఈ కుటుంబాలకు కిరాణా కిట్లను అందజేయనుంది.

10 రోజుల్లో రూ. 500 కోట్లా.. ఈ సినిమా బాక్సాఫీస్ ర్యాంపేజ్ బాసూ..!
10 రోజుల్లో రూ. 500 కోట్లా.. ఈ సినిమా బాక్సాఫీస్ ర్యాంపేజ్ బాసూ..!

కిరాణా ఖర్చుల భారం తగ్గేలా

దీనివల్ల ఆ కుటుంబాలపై పడే రోజువారీ కిరాణా ఖర్చుల భారం పెద్దఎత్తున తగ్గనుంది. అలా ఆదా అయిన డబ్బును ఆయా కుటుంబాలు తమ పిల్లల చదువుకు, ఆరోగ్య అవసరాలకు లేదా భవిష్యత్తు కోసం వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒక కుటుంబానికి మూడు నెలలకు సరిపడా అత్యవసర సరుకులతో ఈ కిట్‌ను అత్యంత జాగ్రత్తగా డిజైన్ చేశారు. ఇందులో 75 కిలోల బియ్యం, 10 కిలోల గోధుమ పిండి, 3 కిలోల రాగులు, 10 లీటర్ల వంట నూనె, 15 కిలోల వివిధ రకాల పప్పు దినుసులు, 2 కిలోల సోయా చంక్స్, 3 కిలోల చొప్పున ఉప్పు, చక్కెర, 1 కిలో కారం పొడి, తలా 500 గ్రాముల చొప్పున పసుపు, చింతపండు, టీ పొడి ఉన్నాయి. ఈ సాయం కేవలం ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా.. హైదరాబాద్, మహబూబ్‌నగర్, అనంతపురం, బెంగళూరు, కొచ్చి, చెన్నై, కొడగు, విజయవాడ వంటి పలు నగరాల్లోని ఎంపిక చేసిన కుటుంబాలకు అందజేస్తున్నారు.

పుష్ప సినిమా తరహాలో స్మగ్లింగ్.. రూ.9 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
పుష్ప సినిమా తరహాలో స్మగ్లింగ్.. రూ.9 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
Rashmika National Crush Adopts the Name Annapurna Provides Huge Financial Aid to 400 Poor Families

ఇతరులకు స్ఫూర్తిగా మారాలని..

సాధారణంగా తాము చేసే సామాజిక కార్యక్రమాలను బయటకు చెప్పుకోవడానికి చాలామంది ఇష్టపడరు. రష్మిక కూడా గతంలో తన సేవలను కేవలం సన్నిహితులు, టీమ్‌కే పరిమితం చేసేది. కానీ ఇప్పుడు ఇలాంటి మంచి పనులను పబ్లిక్‌గా చెప్పడం వెనుక ఒక మంచి ఉద్దేశం ఉందని ఆమె అంటోంది. తాను చేసే ఈ చిన్న ప్రయత్నాన్ని చూసైనా.. తోటివారికి సాయం చేయడానికి మరికొందరు ముందుకు వస్తారనేదే ఆమె ఆశయం. పెద్ద మనసు ఉండటానికి భారీ బడ్జెట్ అక్కర్లేదని, ఎవరి స్థోమతకు తగ్గట్టుగా వారు సాయం చేస్తే సమాజంలో పెద్ద మార్పు తీసుకురావచ్చని ఆమె నిరూపిస్తోంది.

హాట్ టాపిక్‌గా 'రష్మిక దేవరకొండ' పేరు

ఈ సేవా కార్యక్రమానికి సంబంధించిన ప్రమోషన్ పోస్టర్‌లో ఒక ఆసక్తికరమైన అంశం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఇప్పటివరకు 'రష్మిక మందన్న'గా పిలవబడ్డ ఆమె పేరు.. ఈ పోస్టర్‌లో ఏకంగా 'రష్మిక దేవరకొండ' అని ముద్రించబడింది. విజయ్ దేవరకొండతో వివాహం తర్వాత ఆమె తన పేరును ఇలా మార్చుకోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో, అభిమానుల్లో జోరుగా చర్చకు దారితీసింది. ఏది ఏమైనప్పటికీ, రీల్‌ లైఫ్‌లో అద్భుతమైన పాత్రలతో మెప్పించే రష్మిక.. రియల్ లైఫ్‌లోనూ 'అన్నపూర్ణ'లా వందలాది కుటుంబాల ఇళ్లలో వెలుగులు నింపుతుండటం నిజంగా అభినందనీయం!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+