ఆ మేయర్ సీటు కోసం జనసేన పట్టు, చంద్రబాబుతో తుది చర్చలు - ఖరారు జాబితా..!!

స్థానిక ఎన్నికల్లో సీట్ల పంపకాల పై సీఎం చంద్రబాబు వద్ద తుది చర్చలు జరుగుతున్నాయి. ఈ సారి జనసేన నేతలు తమకు కావాల్సిన సీట్ల పైన తొలి నుంచి పట్టు వీడటం లేదు. జనసేనకు ఇచ్చే కార్పోరేషన్, మున్సిపాల్టీల పైన ఇప్పటికే స్పష్టత వచ్చింది. అయితే, అయిదో స్థానం పైన ఇంకా నిర్ణయం జరగలేదు. దీంతో.. ఈ మేయర్ స్థానం కోసం జనసేన ప్రయత్నిస్తోంది. ఈ చర్చల సమయంలో మొత్తం స్థానాల పైన స్పష్టత రానుంది.

జనసేన నేతలు మరోసారి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇక నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండటంతో సీట్ల పైన ఈ రోజు తేల్చనున్నారు. ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో భాగంగా జనసేన ఆరు కార్పోరేషన్లు.. 40 మున్సిపాల్టీలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. అయితే, నాలుగు కార్పోరేషన్లు ఇచ్చేందుకు టీడీపీ ముందుకు వచ్చింది. కాగా.. జనసేనకు విజయవాడ, ఏలూరు, కాకినాడ, శ్రీకాకుళం కేటాయించేందుకు టీడీపీ అంగీకరించింది.

 స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలి.. హైకోర్టులో పిల్..!!
స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలి.. హైకోర్టులో పిల్..!!
Janasena laders demanding Ongole mayor seat as discussions with CM Chandra Babu here the details

అయితే.. తమకు తిరుపతి లేదా ఒంగోలు ఇవ్వాల్సిందేనని జనసేన పట్టుబడుతోంది. ఇందుకు టీడీపీ ఆమోదం తెలపటం లేదు. ఏలూరు మీద పునరాలోచన జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ చర్చల్లో తిరుపతి లేదా ఒంగోలు జనసేన కు స్పష్టత ఇస్తారని అంచనా వేస్తున్నారు.

ఇక, మున్సిపాలిటీల్లో పిఠాపురం, పెద్దాపురం, గొల్లప్రోలు, తుని, అమలాపురం, మండపేట, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, రంపచోడవరం, జగ్గయ్యపేట, రేపల్లె, తెనాలి, పొన్నూరు, నరసరావుపేట, సత్తెనపల్లి, దర్శి, కావలి, శ్రీకాళహస్తి, మదనపల్లె, పుట్టపర్తి, ఆదోని స్థానాలు చర్చకు వచ్చాయి. నగర పంచాయతీల్లో పాలకొండ, నెల్లిమర్ల, ముమ్మిడివరం, మడకశిర పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

 స్థానిక ఎన్నికల్లో ఓటు ఉందా, ఇలా చెక్ చేసుకోండి - లేకపోతే వెంటనే..!!
స్థానిక ఎన్నికల్లో ఓటు ఉందా, ఇలా చెక్ చేసుకోండి - లేకపోతే వెంటనే..!!

వీటి విషయంలో పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కావటం లేదని సమాచారం. తిరుపతి లేదా ఒంగోలు పైన జనసేన పట్టు బడుతున్న వేళ ఈ చర్చల్లో స్పష్టత ఇవ్వటం ద్వారా సర్దుబాటు వ్యవహారం పూర్తి కానుంది. ఈ రాత్రి లోగా మూడు పార్టీలు తాము పోటీ చేసే స్థానాల పైన ఉమ్మడి ప్రకటన చేయనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+