వనస్థలిపురంలో రవితేజ మల్టీప్లెక్స్ ఓపెన్.. మైండ్ బ్లోయింగ్ వరల్డ్ క్లాస్ ఫీచర్స్..
సినీ రంగంలో చాలా మంది హీరోలు స్టార్ లు గా ఎదిగి కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ తర్వాత కొంత మంది నిర్మాతలుగా మారుతారు. మరికొంత మంది బిజినెస్ లోకి అడుగుపెడతారు. అలా సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించి థియేటర్ బిజినెస్ లోకి అడుగుపెడుతున్న స్టార్ హీరోలు చాలామందే ఉన్నారు. వారిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు ఉన్నారు. ఏఎంబీ సినిమాస్ తో మహేశ్ బాబు, అలాగే ఏఏఏ సినిమాస్ తో అల్లు అర్జున్ హైదరాబాద్ లో మల్టీ ప్లెక్స్ లు ఏర్పాటు చేశారు. విజయ్ దేవరకొండ ఏవీడీ సినిమాస్ పేరుతో మల్టీ ప్లెక్స్ ను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు వారి ప్లేస్ లోకి మాస్ మహారాజ రవితేజ చేరిపోయారు.
ART cinemas - Vanasthalipuram
— #RaviTejaFansArmy 💪 (@RavitejaFanArmy) July 28, 2025
6 screens grand opening on 31st July 2025
With #kingdom movie
Finally Premium multiplex in the East Hyderabad area..@RaviTeja_offl @ARTCinemasOffl #ARTCinemas #raviteja #Massjathara pic.twitter.com/g3inFEsGWY
హైదరాబాద్ లోని ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్ ప్రజలకు గుడ్ న్యూస్. మాస్ మహారాజ రవితేజ థియేటర్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. వనస్థలిపురంలో ART సినిమాస్ పేరుతో వరల్డ్ క్లాస్ ఫీచర్స్ తో నిర్మించిన ఈ థియేటర్ ప్రారంభానికి ముస్తాబైంది. జులై 31 న గ్రాండ్ గా ఈ మల్టీప్లెక్స్ ఓపెన్ కానుంది. ఇప్పటికే దాదాపు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇటీవల ప్రారంభించిన ఇంటీరియర్ వర్క్ పూర్తయినట్లు సమాచారం. ఈ క్రమంలో జులై 31న ఈ మల్టీప్లెక్స్‌ను గ్రాండ్‌గా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవాన్ని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లుతో స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ నిర్మాణ పనులు పూర్తికాకపోవడం కారణంగా కొంత ఆలస్యం అయినట్లు సమాచారం. ఇక జులై 31 న అన్ని హంగులతో ఈ థియేటర్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

ఇక ఏఆర్ టీ మల్టీప్లెక్స్‌ను అత్యాధునిక సాంకేతికతతో నిర్మించినట్లు సమాచారం అందుతోంది. ఈ థియేటర్ లో వరల్డ్ క్లాస్ ఫీచర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 57 అడుగుల వెడల్పుతో భారీ స్క్రీన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, 4 కే క్వాలిటీ ప్రొజెకక్షన్, అల్ట్రా క్లియర్ విజువల్స్, అలాగే 6 స్క్రీన్ లతో సినిమా ప్రేమికులకు సరికొత్త అనుభూతిని అందించే విధంగా సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే పలు సార్లు టెస్టింగ్ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. జులై 31 న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ మూవీతోనే థియేటర్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications