మహేష్ బాబుతో నటించొద్దని పవన్ కల్యాణ్ చెప్పారా..?

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌ తిరిగి తెలుగు సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పెళ్లి , విడాకులు తరువాత ఆమె సినిమాల్లో కనిపించింది లేదు. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తరువాత రేణు దేశాయ్‌ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంది. రేణు దేశాయ్‌ చాలకాలం తరువాత తెలుగు సినిమాలో నటించింది.

రవితేజ తాజాగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్‌ ఓ ముఖ్య పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రేణు దేశాయ్‌ సంచలన కామెంట్స్ చేశారు. మహేష్ బాబుతో తనకు నటించే అవకాశం వచ్చిన ..దానిని వదులుకున్నానని రేణు దేశాయ్‌ చెప్పుకొచ్చింది. అయితే మహేష్ బాబుతో నటించే అవకాశాన్ని ఎందుకు వదులుకున్నానో చెబితే అది పెద్ద వివాదంగా మారుతుందని రేణు దేశాయ్‌ వెల్లడించారు.

Renu desai about mahesh babu movie offer

ఆ విషయాన్ని సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుంది.పవన్ కల్యాణ్‌తో కలిసి రేణు దేశాయ్‌ రెండు సినిమాల్లో నటించింది. బద్రి, జానీ సినిమాల్లో పవన్‌కు జోడి రేణు దేశాయ్‌ కనిపించారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమ సహజీవనంగా మారి ఆ తరువాత పెళ్లి వరకు దారి తీసింది. బద్రి సినిమా తరువాత మహేష్ బాబుతో నటించే అవకాశం వచ్చినప్పటికీ..అప్పటికే రేణు దేశాయ్ పవన్‌తో ప్రేమలో ఉంది. పవన్‌ను పెళ్లి చేసుకున్న తరువాత రేణు దేశాయ్ సినిమాలకు దూరంగా ఉంది.

Renu desai about mahesh babu movie offer

అంతే కాకుండా పవన్‌తో తప్పిస్తే మరే హీరోతో కూడా రేణు దేశాయ్ నటించలేదు.దీంతో పవన్ చెబితేనే రేణు దేశాయ్ మహేష్‌తో ఆఫర్‌ను వదులుకుందనే గుస గుసలు వినిపిస్తున్నాయి. పవన్ చెప్పడంతోనే మహేష్ బాబుతో సినిమా అవకాశాన్ని రేణు దేశాయ్‌ వదులుకుందనే టాక్ ఇండస్ట్రీలో వినబడుతున్నాయి.పవన్ పేరు చెబితే ఎక్కడ కాంట్రవర్సీ అవుతుందనే రేణు దేశాయ్‌ ఆయన పేరు బయటకు చెప్పడం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే రేణు దేశాయ్‌ని మహేష్ బాబుతో నటించొద్దని పవన్ కల్యాణ్ చెప్పారా లేదా అనే దానిలో ఎంత వరుకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+