రేణు దేశాయ్ వార్నింగ్: ఇక భరించను, మీ ఇంటికొచ్చి కూర్చుంటా
నటి రేణూ దేశాయ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఆవేదన ఇప్పుడు నెటిజన్ల మనసును కలచివేస్తోంది. దశాబ్ద కాలానికి పైగా తాను అనుభవిస్తున్న మానసిక క్షోభను, ఎదుర్కొంటున్న అసభ్యకర దాడులను తలచుకుంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఒక సున్నితమైన అంశంపై ఆమె చేసిన పోరాటాన్ని వక్రీకరిస్తూ, కొందరు వ్యక్తులు చేస్తున్న పైశాచిక కామెంట్స్‌పై ఆమె ఎమోషనల్ అవుతూనే తీవ్రంగా మండిపడ్డారు.
"2012లో విడాకులైనప్పటి నుండి నాపై విమర్శలు మొదలయ్యాయి. భరణం గురించి, నా వ్యక్తిగత జీవితం గురించి, నా రాజకీయ భావజాలం గురించి.. ఇలా ఒకటేమిటి ప్రతి విషయంలోనూ నన్ను వేధిస్తూనే ఉన్నారు. ఇవన్నీ భరిస్తూ ఏదో ఒక రోజు ఆగుతాయేమోనని మౌనంగా ఉన్నాను. కానీ, మౌనాన్ని చేతకానితనంగా భావించి నాపై విద్వేషం కక్కుతున్నారు" అంటూ రేణూ దేశాయ్ తన వేదనను వెళ్లగక్కారు.

ఒక్క మాట.. వందల బూతులు..
జనవరిలో జరిగిన ఓ ప్రెస్ మీట్ ప్రస్తావిస్తూ.. "వందలాది మూగజీవాలను చంపేస్తుంటే తట్టుకోలేక, ఒక పది కుక్కల కోసం మిగిలిన 90 కుక్కల్ని చంపొద్దని అన్నాను. అందులో తప్పేముంది? నా మాటల్ని వక్రీకరించి నన్ను 'దున్నపోతు' అని, 'రేబిస్ వచ్చింది' అని ఇష్టమొచ్చినట్లు దూషించారు. ఒక సినిమా చేస్తే నా నటన బాగోలేదని విమర్శించండి, పడతాను. కానీ, నా వ్యక్తిగత జీవితంపై, నా శరీరంపై అసభ్యకరంగా మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు?" అని ఆమె ప్రశ్నించారు.
హద్దులు దాటిన పైశాచికత్వం..
సోషల్ మీడియాలో వచ్చిన ఒక ఘోరమైన కామెంట్ గురించి చెబుతూ ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. "పిచ్చి కుక్కలు రేణూ దేశాయ్ ప్రైవేట్ పార్ట్స్‌ని కరిస్తే ఆ బాధ తెలుస్తుంది అని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. ఇదేం సంస్కారం? మిమ్మల్ని మీ అమ్మానాన్నలు ఇలాగే పెంచారా? ఆడ, మగ తేడా లేకుండా ఇంత నీచంగా ఎలా మాట్లాడుతున్నారు? కుక్కల బెడద ఉంటే మీ ఎమ్మెల్యేలతో, కార్పొరేటర్లతో పోరాడండి.. నాపై ఈ పైశాచికత్వం ఎందుకు?" అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక భరించడం నా వల్ల కాదు..
కాశీకి వెళ్లినా, పద్ధతిగా దుస్తులు ధరించి ఫోటో దిగినా 'రాత్రికి రేటెంత?' అని అడుగుతున్న మూర్ఖులపై ఆమె ధ్వజమెత్తారు. "ఇకపై ఇలాంటి బూతు కామెంట్స్ కనిపిస్తే ఊరుకోను. మీ ఇంటి వరకు వస్తాను. మీ అమ్మానాన్నల ముందు, మీ అక్కాచెల్లెళ్ల ముందు మీరు పెట్టిన కామెంట్స్ పెట్టి.. ఇదేనా మీరు నేర్పిన సంస్కారం అని అడుగుతాను. మీకు అంతగా తిట్టాలనిపిస్తే నేనే పబ్లిక్‌లోకి వస్తాను, నా పేరెంట్స్‌ని, నా పిల్లల్ని అందరినీ తిట్టండి. కానీ దానివల్ల ఏ ప్రాణమైనా నిలబడుతుందా? దమ్ముంటే మీరు ఎన్నుకున్న నాయకులను ప్రశ్నించండి" అంటూ రేణూ దేశాయ్ ఎమోషనల్ అవుతూ వార్నింగ్ ఇచ్చారు.
-
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
"'ధురంధర్' సినిమానే కాదు.. ప్రభుత్వానికి రాసిన ప్రేమలేఖ" -
విశ్వాసం అంటే ఇది.. రూ.5 బిస్కెట్ ప్యాకెట్ వేస్తే 130కి.మీ వెంట నడిచిన శునకం! -
నిర్మల్ జిల్లాలో పాము పిల్లల కలకలం.. -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications