కేజీఎఫ్ హీరోకు షాక్ ఇచ్చి కాంతార హీరోకు చాన్స్ ఇచ్చిన కంపెనీ, ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ !

కాంతార సినిమా ద్వారా రిషబ్ శెట్టి పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా మారారు. కాంతార సినిమాకు దర్శకుడిగా, హీరోగా నటుడిగా రిషబ్ శెట్టి సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం కాంతార సినిమా పార్ట్ 2 పనుల్లో రిషబ్ శెట్టి చాలా బిజీగా ఉన్నాడు. రిషబ్ శెట్టి చాలా కాలంగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇప్పుడు కాంతార హీరో రిషబ్ శెట్టి కేజీఎఫ్ హీరో యశ్ కు ఊహించని షాక్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.

రామ్‌రాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి ఎంపికావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కేజీఎఫ్ హీరో రాకింగ్ స్టార్ రాఖీభాయ్ యష్ గత రెండేళ్లుగా ఈ రామ్ రాజ్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఈ ఏడాది ఆ అవకాశం రిషబ్ శెట్టికి దక్కింది. ఇది చూసి కొందరు చాలా ఆశ్చర్యపోతున్నారు. కాంతార సినిమా వచ్చినప్పటి నుంచి రిషబ్ శెట్టి దాదాపుగా పంచెలోనే ఎక్కడ చూసినా ఎక్కువగా కనిపిస్తున్నాడు.

Rishabh Shetty has a chance to be the brand ambassador, leaving Yash aside
నా మొగుడి జోలికి వస్తే నీ అంతుచూస్తా, నటికి స్టార్ హీరో భార్య వార్నింగ్, సిగ్గుంటే ఆ ఫోటోలు?

ఇప్పుడు ఒక మెట్టుపైకి ఎక్కిన రిషబ్ శెట్టి ఏకంగా అతి పెద్ద కాటన్ తయారీదారు, సరఫరాదారు, కాటన్ ధోతీలు, చొక్కాలు, మహిళలు, పిల్లల దుస్తులను ఎగుమతి చేసే రామ్ రాజ్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఇప్పటికే ఈ యాడ్ విడుదలై వైరల్ అవుతోంది. రామ్ రాజ్ సంస్థ ప్రకటనల్లో కేజీఎఫ్ స్టార్ యష్ మాయంఅయ్యి కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి ప్రత్యక్షం కావడంతో రాఖీభాయ్ అభిమానులు షాక్ అవుతున్నారు.

ఏకత్వంలో భిన్నత్వం మనకు గర్వకారణం. ప్రతి వంద కిలోమీటర్లకు ఒక సంస్కృతి, 200 కి.మీ దాటితే ట్రీట్ మెంట్ మారిపోతుంది. అయితే సంక్రాంతి తీపి అయినా, ఓనం తీపి అయినా రుచి ఒకటే. 400 కి.మీ తర్వాత భాష మారుతుంది. అయితే ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్నదే అందరి కోరిక. 600 కిలోమీటర్లు దాటితే ఆచారం మారుతుంది కానీ మనసులను కలిపే బంధం ఒక్కటే అని రిషబ్ శెట్టి వాయిస్ ఓవర్ రామ్ రాజ్ ప్రకటనలో చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

రామ్ రాజ్ కొత్త కలర్ ఫుల్ యాడ్ షూట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. పంచెతో పాటు కుర్తా, షర్టుల్లో రిషబ్ శెట్టి డిఫరెంట్ గెటప్‌లలో కనిపిస్తున్నాడు. కాంతార చాప్టర్-1 చిత్రం కోసం రిషబ్ పొడవాటి గడ్డం, జుట్టుతో కనిపించాడు. కొన్ని యాంగిల్స్ లో అక్కడ ఉన్నది యష్ లేదా రిషబ్ శెట్టినా అని అభిమానులు అయోమయంలో పడ్డారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. రామ్‌రాజ్ సంస్థ దక్షిణ భారతదేశంలోనే కాకుండా ఉత్తర భారతదేశంలో కూడా ప్రసిద్ధి చెందింది.

Rishabh Shetty has a chance to be the brand ambassador, leaving Yash aside

అదే కారణంతో ఇటీవల పాన్ ఇండియా స్టార్లను బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేస్తున్నారు. ఇందుకోసం హీరోలు కూడా భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. రిషబ్ శెట్టి కూడా భారీ రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రిషబ్ శెట్టి కూడా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం కార్యక్రమానికి ఆయన భార్యతో పాటు హాజరయ్యారు. అయోధ్య ఆలయం నిర్వహణ కమిటీ ఆహ్వానం మేరకు రిషబ్ శెట్టి ఆయన భార్యతో కలిసి రామమందిరాన్ని సందర్శించారు.

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం కార్యక్రమానికి సంబంధించి రిషబ్ శెట్టి ఫోటోలు వైరల్ అయ్యాయి. రిషబ్ శెట్టి పంచె కట్టు కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. కాంతార సూపర్‌ సక్సెస్‌ తర్వాత ప్రీక్వెల్‌ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాయి. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద కేజీఎఫ్ హీరో యశ్ కు షాక్ ఇస్తూ ప్రముఖ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా రిషబ్ శెట్టి చాన్స్ కోట్టేయడం ఇప్పుడు స్యాండిల్ వుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+