ఆ ఎమ్మెల్యే కూతురితో యాంకర్ సుమ కొడుకు పెళ్లి..?
యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో సుమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. కేరళ అమ్మాయి అయినప్పటికి, తెలుగు అనర్గళంగా మాట్లాడుతూ స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. చేసేది ఏ షో అయినా, అక్కడున్నది స్టార్ హీరోనైనా అందరి కళ్లు తనవైపు తిప్పుకునేలా చేయడంలో సుమ సిద్ధహస్తురాలు. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమా ఈవెంట్స్‌ను చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.
ఎన్నో ఏళ్లుగా యాంకర్‌గా తన సత్తాను కొనసాగిస్తుంది. ఇంకా చెప్పాలంటే స్టార్ హీరోలందరికి కూడా బెస్ట్ యాంకర్‌గా సుమ నిలిచిపోయారంటే ...ఆమె క్రేజ్ ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. యంగ్ హీరోలు సైతం సుమను అభిమానిస్తుంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సమయంలో మాట్లాడుతూ.. సుమ ఉంటే ఆ ఈవెంట్ సక్సెస్ అయినట్టే అని, నటులను కంఫర్ట్ జోన్‌లో ఉండేలా చూడటంలో ఆమె తర్వాతే ఎవరైనా అని కామెంట్స్ చేశారు.

యాంకర్ సుమ ఎలాంటి పరిస్థితులనైనా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. పంచ్‌లు వేయడమే కాదు, ఎదుటివాళ్లు వేసే పంచ్‌లకు రివర్స్ కౌంటర్ ఇస్తుంటారు. ఇక సుమ భర్త రాజీవ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరి కొడుకు రోషన్ కనకాల హీరోగా పరిచియం అయ్యారు.బబుల్‌గమ్ సినిమాతో రోషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం తన రెండో సినిమా పనుల్లో రోషన్ బిజీగా ఉన్నారు. ఇదెలా ఉంటే రోషన్ పెళ్లికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
రోషన్ ఓ రాజకీయ ఫ్యామిలీకి చెందిన అమ్మాయితో ఉన్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉండటంతో రెండు ఫ్యామిలీలు వీళ్లకు పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారట. త్వరలోనే దీనికి సంబంధించిన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వార్తల్లో నిజమేంత ఉందో తెలియాలంటే సుమ క్లారిటీ ఇచ్చేవరకు ఆగాల్సిందే.












Click it and Unblock the Notifications