'సలార్' మొదటి షో పడింది అక్కడే...బొమ్మ దద్దరిల్లిపోయింది
దేశం మొత్తం ప్రభాస్ నటించిన సలార్ సినిమాతో ఊగిపోతుంది. షారుఖ్ ఖాన్ ఇమేజ్‌ను డామినేట్ చేసి మరి ప్రభాస్ తన స్టామినా చూపిస్తున్నారు. కేజీఎఫ్ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో సలార్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఇప్పటి వరకూ విడుదలైన టీజర్, ట్రైలర్స్ ఆకట్టుకోవడంతో సలార్‌పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు 800 కోట్లకు పైగానే బిజినెస్ జరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఒక్క తెలుగులోనే 270 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందంటే సలార్ రేంజ్ ఎంతలా ఊహించుకోవచ్చు. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ సలార్ హక్కులను కొనుగొలు చేశారు. తమిళ , కన్నడ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతుండగా, హిందీలో కూడా అదే స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇక సలార్ టికెట్ల రేట్లను పెంచుకోవడానికి రెండు తెలుగు ప్రభుత్వాలు గ్రీన్ సీగ్నల్ ఇచ్చాయి. తెలంగాణలో టికెట్ పై రూ.65 నుంచి రూ.100 వరకు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వగా, ఏపీ ప్రభుత్వం రూ 40 వరకు పెంచుకునే అవకాశం కల్పించింది. తెలుగు రాష్ట్రాల్లో సలార్ సందడి నెలకొంది. థియోటర్ల దగ్గర ప్రభాస్ అభిమానుల కోలాహలం కనిపిస్తుంది.

అయితే తెలుగు రాష్ట్రాల్లో సలార్ మొదటి షో మాత్రం సూళ్లురుపేటలోని పడనుందని సమాచారం అందుతుంది. అది కూడా గురువారం అర్థరాత్రి 12:15 నిమిషాలకు తొలి షో మొదలుపెడతారని తెలుస్తుంది. 'వి ఎపిక్' మల్టీప్లెక్స్‌లో సలార్ మొదటి షో పడిన తరువాతే మిగిలిన చోట్ల సలార్ షోలు స్టార్ట్ అవుతాయాని అభిమానులు చెబుతున్నారు. దేశంలోనే అతిపెద్ద స్క్రీన్‌గా 'వి ఎపిక్' థియోటర్ పేరుగాచింది.

ప్రభాస్ స్నేహితులైన యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమా థియోటర్‌ను నిర్మించారు. ఇప్పుడు ఆ థియోటర్‌లోనే 'సలార్' మొదటి షో పడటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 'వి ఎపిక్' థియోటర్ దగ్గర అభిమానులు భారీ ఎత్తున చేరుకుని హంగామా సృష్టిస్తున్నారు.
The Best in recent times?? or RRR or any other movie celebrations like this??#Salaar #Prabhas Mania Allover world 🔥🔥💥💥💥
— Rk94Cr7 (@Rk9CR7) December 21, 2023
All the Best Darling #Prabhas 👍😊
Hoping it'll be Blockbuster 👍🔥#SalaarBookings #SalaarCeaseFire #SalaarReview
pic.twitter.com/1oN9eXO0LR












Click it and Unblock the Notifications