పాకిస్థాన్‌కు మద్దతుగా సమంత పోస్ట్..? వెంటనే డిలీట్

స్టార్ హీరోయిన్ సమంత సంచలన పోస్ట్ పెట్టారు. సింధు జలాలను పాక్‌కు వెళ్లకుండా భారత్ నిలిపి వేసిన సమయంలోనే సమంత షేర్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఇండియా , పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్న సంగతి తెలిసిందే. కాశ్మీర్‌లోని పహల్గామ్‌‌లో ఉగ్రవాదుల దాడి ఘటనలో 27 మంది అమాయక పర్యాటకుల రక్తం నేలపై చిందింది. ప్రకృతి ఒడిలో సేద తీరాలని వచ్చిన 28 మంది ఊహించని రీతిలో మృత్యు ఒడికి చేరారు. వారి ఆనందపు కేరింతలు కాస్తా ఆర్తనాదాలుగా మారి, ఆ లోయంతా విషాద ఛాయలు అలముకున్నాయి.ఈ దుర్ఘటన కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే కాదు, యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

అందమైన లోయ రక్తంతో తడిసి ముద్దవడం, శాంతిని కోరుకున్న వారి ప్రాణాలు ఉగ్రవాదుల చేతుల్లో అంతమవ్వడం అందర్ని కలిచి వేసింది. ఈ దాడిపై మోదీ ప్రభుత్వం ఘాటుగా రియాక్ట్ అయింది. దీనికి సంబంధించిన వారిని ఎవర్నీ కూడా వదిలిపెట్టబోమని,ఎక్కడ దాక్కున్న ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని మోదీ హెచ్చరించారు. హల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై భారత ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీని వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్టు భారత ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పాకిస్థాన్‌పై భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.

Samantha shares Pope Francis quote

దేశంలో ఉన్న పాక్ పౌరులను స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో సింధు నదిలో ఇచ్చే వాటాలను సైతం నిలిపిస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇటువంటి సమయంలోనే సమంత షేర్ చేసిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఆ పోస్ట్‌లో "సముద్రాలు.. నీళ్లు తాగలేవు, చెట్లు తమ పండించిన పండ్లు తినలేవు, సూర్యుడు తన కాంతిని చూడలేడు, పువ్వులు తమ పరిమళాన్ని ఆస్వాదించలేవు, ప్రకృ‌తి కోసం జీవించండి, మనమందరం కూడా ఒకరికి ఒకరు సాయం చేసుకోవడానికే భూమి మీద పుట్టాము, నీ కోసం జీవిస్తే, ఆనందంగా ఉంటావు, అందరి కోసం జీవిస్తే ఇంకా ఆనందంగా ఉంటావు" అనే అర్ధం వచ్చేలా సమంత పోస్ట్ చేసింది.

పైగా ఈ కొటేషన్ పోప్ ఫ్రాన్సిస్ చెప్పినట్టుగా సమంత తన పోస్ట్‌లో తెలిపింది. భారత్ సింధు జలాలను పాకిస్థాన్‌కు వెళ్లకుండా నిలుపుదల చేసిన సమయంలోనే సమంత ఈ పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. సమంత షేర్ చేసిన పోస్ట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమంత ఈ పోస్ట్ ద్వారా ఏం చెప్పాలని అనుకుంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. తర్వాత కొన్ని గంటలకే సమంత తన పోస్ట్‌ను డిలీట్ చేయడం జరిగింది. అయితే సమంత ఏ ఉద్దేశంతో ఆ పోస్ట్ షేర్ చేశారో తెలియదు కానీ, ప్రస్తుతం ఇండియా , పాక్ పరిస్థితులకు తగ్గట్టు ఉండటంతో ఆమెపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దీనిపై సమంత క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+